Shocking: చికెన్ ఇలా తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ప్రాణాలు పోతున్నాయి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

Chicken Shocking Facts: చికెన్‌ అంటే అందరికీ ఇష్టం. ఆదివారం వచ్చిందంటే నాన్‌ వెజ్‌ ప్రియులు చికెన్‌ తినాల్సిందే. ఏ పార్టీ జరిగినా చికెన్‌ రిసిపీ చేసుకోవాల్సిందే. అయితే, మీరు చికెన్‌ తినే పద్ధతి ఉంది. అది కాకుండా ఇష్టం వచ్చినట్లు తింటా అంటే ప్రాణాలు పోతున్నాయి తస్మాత్‌ జాగ్రత్త.. చికెన్‌, మయోనైజ్‌ కలిపి తిని ఓ యువతి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /7

ఇటీవలే జీహెచ్‌ఎంసీ మయోనైజ్‌ బ్యాన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఎందుకుంటే మోమోస్‌ తిని ఓ యువతి మృతి చెందింది. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హెల్త్‌ మినిస్టర్‌ దామోదర రాజనర్సింహ ఆదేశాలతో మయోనైజ్‌ బ్యాన్‌ చేశారు.  

2 /7

అయితే, మరో ఘటలో నిర్మల్‌లోని గ్రిల్‌9 రెస్టారెంట్‌లో ఓ యువతి చికెన్‌ బిర్యానీ తిని తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయింది. ఈ ఘటనలో సదరు యువతి చికెన్‌పై మయోనైజ్‌ వేసుకుని తినడం వల్ల ప్రాణాలు కోల్పోయిందని తేలింది.   

3 /7

ఈ ఘటనలో కూడా పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే, తెలంగాణలో మయోనైజ్‌ విక్రయం, వాడకం నిషేధించినా కానీ, ఇంకా రెస్టారెంట్లు వాటి వాడకం చేస్తున్నారు. ఇలాంటి హోటళ్లపై కొరడా ఝుళిపిస్తున్నారు. గ్రిల్‌ 9 రెస్టారెంట్‌ను ఇప్పటికే సీజ్‌ చేశారు.  

4 /7

అవును మనం ఇంట్లో చేసుకునే చికెన్‌ అయితే, అన్నం, చపాతీలోకి నేరుగా తినే పద్దతి మాత్రమే కాదు. కానీ, ఆధునిక పోకడల వల్ల చికెన్‌తోపాటు ఇతర సాస్‌, మయో వేసుకుని తినే అలవాటు ప్రారంభించారు. ప్రస్తుతం ఇదే ప్రాణాలు తీస్తోంది.  

5 /7

మయోనైజ్‌ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరుగుతున్నాయని తేలింది. దీంతో బరువు కూడా పెరుగుతారు. మయోనైజ్‌ తినడం వల్ల వాంతులు, వికారం కూడా వస్తాయి. ఈ మయోనైజ్‌ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగి గుండెపోటుకు కూడా దారితీస్తుంది.  

6 /7

చికెన్‌ తినేటప్పుడు కూడా మీరు తస్మాత్‌ జాగ్రత్త కొన్ని రెస్టారెంట్లు అలాగే మయో వేసి విక్రయిస్తున్నారు. చికెన్‌తోపాటు మయోనైజ్‌ కలిపి తీసుకోవడం ప్రాణాంతకం. అంతేకాదు చికెన్‌ వండిన 24 గంటల తర్వాత కొంతమందికి మళ్లీ వేడి చేసి తినే అలవాటు ఉంటుంది.  

7 /7

గతంలో ఓ ఘటనలో కూడా ఓ ఎనిమిదేళ్ల పాప ప్రాణం పోయింది. చుట్టాలు వస్తారని చికెన్‌ ఎక్కువ మోతాదులో వండారు. కొన్ని పరిస్థితుల్లో మిగిలిన చికెన్‌ కూర ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు మళ్లీ వేడి చేసి తిన్నారు. ఈ ఘటనలో పాప ప్రాణం పోయింది. మిగిలిన వారు ఆస్పత్రి పాలయ్యారు.