Hero Splendor Electric Bike: బైక్‌ అంటే ఇది.. కొత్త Hero Splendor ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 160 కి.మీ మైలేజీ.. ఫీచర్స్‌ ఇవే!

Hero Splendor Electric Bike: హీరో స్ప్లెండర్ త్వరలోనే ఎలక్ట్రిక్ వేరియంట్‌లో కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బైక్ విడుదలకు ముందే అనేక ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ విడుదలయ్యాయి. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. 

Hero Splendor Electric Bike: గతంలో హీరో హోండా కంపెనీ విడుదల చేసిన స్ప్లెండర్ బైక్ కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉండేదో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత హీరో హోండా కంపెనీలు విడిపోయి.. వేటికి అవే స్థిరపడ్డాయి. పోను పోను హీరో కంపెనీ ఈ స్ప్లెండర్ బైక్‌ని కొత్త కొత్త మోడల్స్‌తో తయారు చేసే విక్రయించింది. ఇప్పటికీ కూడా ఈ బైక్‌కి మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. అందుకే హీరో కంపెనీ దీనిని వివిధ రకాల వేరియంట్లలో విడుదల చేస్తూ వస్తోంది. 
 

1 /5

హీరో కంపెనీ తమ కస్టమర్స్‌కి ఈ స్ప్లెండర్ విషయంలో గుడ్ న్యూస్ తెలిపింది. దీనిని కంపెనీ త్వరలోనే ఎలక్ట్రిక్ వేరియంట్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆకర్షణీయమైన ఫీచర్లతో పాటు అద్భుతమైన మైలేజీలో అందుబాటులోకి తీసుకురాబోతోంది.   

2 /5

హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్‌ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు కంపెనీ ప్రత్యేకమైన కలర్ ఆప్షన్స్‌తో పాటు ప్రీమియం ఫినిషింగ్ అందించింది. ఇందులో ప్రత్యేకమైన బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ సపోర్టును కూడా అందిస్తోంది.   

3 /5

అలాగే ఈ స్ప్లెండర్ స్మార్ట్ బైక్‌లో ప్రత్యేకమైన జీపీఎస్ నావిగేషన్ సెటప్‌ను కూడా అందిస్తోంది. దీంతోపాటు 3 కిలోవాట్ అద్భుతమైన బ్యాటరీని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 160 కిలోమీటర్ల వరకు మైలేజీలో అందిస్తుంది.   

4 /5

దీంతోపాటు ఈ స్ప్లెండర్ స్మార్ట్ బైక్‌లో ఫ్రంట్ భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను కూడా అందిస్తోంది. ఇక రెండు చక్రాలకు ప్రత్యేకమైన డిస్క్ బ్రేక్ సిస్టంలో కూడా అందిస్తోంది. అలాగే ఇవే కాకుండా అనేక రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నట్టు తెలుస్తుంది.  

5 /5

హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ రూ.1.20 లక్షల్లోపు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని 2024 సంవత్సరం డిసెంబర్లో లేదా 2025 సంవత్సరం జనవరి మొదటి వారంలోనైనా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.