7th Pay Commission DR Hike: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నుంచి దీపావళి సందర్బంగా భారీ నజరానా అందనుంది. పెన్షనర్ల బకాయిలు చెల్లింపుకు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్ వెలువడింది. పెన్షనర్లకు రావల్సిన డీఆర్ బకాయిలు చెల్లింపుల అంశమింది. దీని ప్రకారం ఎవరెవరికి ఏ మేరకు ప్రయోజనం కలగనుందో తెలుసుకుందాం.
తదుపరి సూచనల కోసం నిరీక్షించకుండా పెన్షనర్లు అందరికీ డియర్‌నెస్ రిలీఫ్ లెక్కించి ప్రాసెస్ చేయాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు
కుటుంబ పెన్షనర్లు, తిరిగి ఉద్యోగంలో చేరిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఈ నిబంధనలు వర్తించనున్నాయని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోరాండంలో ఉంది. అయితే సుప్రీంకోర్టు, హైకోర్టు రిటైర్ న్యాయమూర్తుకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ కానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం డియర్‌నెస్ రిలీఫ్ పాక్షికంగా చెల్లిస్తారు. అక్టోబర్ పెన్షన్ పంపిణీ కంటే ముందు డీఆర్ బకాయిలు చేతికి అందవు
డీఆర్ పెంపుతో ఎవరికి ప్రయోజనం డియర్‌నెస్ రిలీఫ్ పెంపుతో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, సాయుధ దళాల పెన్షనర్లు, రైల్వే పెన్షనర్లతో పాటు ఇతర వర్గాల పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ఇది తాత్కాలిక పెన్షన్ తీసుకునే పెన్షనర్లకు, బర్మా, పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన ప్రభుత్వ పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది.
పెరిగిన డీఏ, డీఆర్ కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నెలలో డియర్‌నెస్ అలవెన్స్ అంటే డీఏ, డియర్‌నెస్ రిలీఫ్ అంటే్ డీఆర్ రెండింటినీ 3 శాతం పెంచింది. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 53 శాతానికి, పెన్షనర్లకు డీఆర్ 53 శాతం పెరిగింది. అక్టోబర్ నెల జీతంతో భారీగా డీఏ, డీఆర్ అందింది.
7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు, రిటైర్ అయినవారికి ముఖ్యమైన అప్‌డేట్. కేంద్ర ప్రభుత్వం మెమోరాండం జారీ చేసింది. ఈ మెమోరాండం ప్రకారం ఈ ఏడాది 2024 అక్టోబర్ నెలలో షెడ్యూల్ చేసిన పెన్షన్ కంటే ముందే డీఆర్ బకాయిలు చెల్లించనున్నారు.