Telangana Samagra Kutumba Survey: ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే జరిపేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తోన్న రేవంత్ సర్కార్ ఈ సర్వేకు కూడా పూనుకుంది. అయితే, ఎన్యూమరేటర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం అడుగుతారు? ఏ పత్రాలు మీరు కలిగి ఉండాలి? తెలుసుకుందాం.
తెలంగాణలో సరికొత్త విధానంతో సర్వే చేయడానికి సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నెల 6వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి సర్వే చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగులకు ట్రైనింగ్ కూడా ఇచ్చింది.
ఇంటింటి సర్వేకు ఎన్యూమరేటర్లు వస్తారు. ఈ సమగ్ర కుటుంబ సర్వే పత్రంలో దాదాపు 75 ప్రశ్నలు, ఉప ప్రశ్నలు కూడా కలిగి ఉంటాయి. అయితే, ఎన్యూమరేటల్, సూపర్ వైజర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు వారు ఏం అడుగుతారు? మీ వద్ద ఉండాల్సిన పత్రాలు ఏంటి? ఇంట్లో ఎంతమంది అందుబాటులో ఉండాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇంట్లో కేవలం ఒక్క వ్యక్తి ఇంటి పెద్ద ఉంటే సరిపోతుంది. ఈ సమగ్ర కుటుంబ సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు ప్రధానంగా మీ ఆర్థిక స్థితి, ఏ పనిచేస్తున్నారు, ఎక్కడ భూములు ఉన్నాయి, ఎన్ని పథకాల్లో అర్హులు కలిగి ఉన్నారు. మీకు ఎన్ని విధాలుగా ఆదాయం సమకూరుతుంది. ఇంట్లో ఎంత మంది చదువుతున్నారు? ఎక్కడెక్కడి నుంచి ఆదాయం సంపాదిస్తున్నారు అడుగుతారు. ఈ వివరాలను గోప్యంగా ఉంచుతారు.
ఇప్పటి వరకు ఎన్ని పథకాల్లో మీరు అర్హత పొందారు, ఇందులో కులగణన కూడా చేపట్టనున్నారు. పిల్లలు బడికి ఎంతమంది వెళ్తున్నారు? మానేస్తే కారణం ఏంటి? అన్ని వివరాలు తెలియజేయాలి. ఇక ఇంటి నీటి సరఫరా, ఇతర ట్యాక్స్ వివరాలు కూడా తెలియజేయాల్సి ఉంటుంది.
కులం, మతం, ఆదాయం , ఏవైనా లోన్లు దానికి కారణాలు వంటివి సేకరిస్తారు. మీ నుంచి ఎలాంటి పత్రాలు తీసుకోరు వాటన్నీ వివరాలను ఆ పత్రంలోనే ఫైల్ చేస్తారు. మొబైల్ నంబర్, మీ వద్ద ఉన్న భూముల వివరాలను కూడా సేకరిస్తారు.
ఈ సమగ్ర కుటుంబ సర్వేలో ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 7వ తేదీ నుంచి మూడు వారాలపాటు కేవలం ఒంటిగంట వరకే బడులు నడుస్తాయి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత విద్యార్థులు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.
నవంబర్ 6వ తేదీ నుంచి ఈ సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణ ప్రభుత్వం చేపట్టనుంది. ఇదిలా ఉండగా కులగణన చేయడం వల్ల బీసీల్లో పెను మార్పులు రాబోతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు కులగణన చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు.