Nothing Phone 2a plus Community Edition: అత్యంత తక్కువ ధరకే నథింగ్ ఫోన్ 2a ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ (Nothing Phone 2a plus Community Edition) మార్కెట్లోకి విడుదలైంది. ఇది అద్భుతమైన ఫీచర్స్ తో పాటు ప్రీమియం డిజైన్ ను కలిగి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి
Nothing Phone 2a plus Community Edition: అందరి ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నథింగ్ ఫోన్ 2a ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ (Nothing Phone 2a plus Community Edition) భారత మార్కెట్లోకి రానే వచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్ తో అట్రాక్టింగ్ లుక్ తో అందుబాటులోకి వచ్చింది. దీనిని నథింగ్ కంపెనీ స్టాండర్డ్ 2a ప్లస్ మోడల్ లో భాగంగా గతంలో విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం యువతను ఎంతగానో ఆకట్టుకుంతోంది. ఈ ఎడిషన్ లో భాగంగా మార్కెటింగ్, డిజైన్ ఇలా వివిధ రకాల దశల్లో కంపెనీ ఇతర కమ్యూనిటీ సహాయంతో ఈ మొబైల్ ను రూపొందించి విడుదల చేసింది.
ఇక ఈ కొత్త ఎడిషన్ మొబైల్ కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీని వెనక భాగంలో గ్రీన్ ఫోస్పోరేసెంట్ మెటీరియల్ కోటింగ్‌తో అందుబాటులోకి వస్తోంది. అలాగే చీకట్లో కూడా మెరిసే విధంగా కొన్ని ప్రత్యేకమైన లోహాలతో దీనిని తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే నథింగ్ కంపెనీ ఈ మొబైల్స్ ను కేవలం 1000 మాత్రమే తయారు చేసింది.
నథింగ్ ఫోన్ 2a ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ (Nothing Phone 2a plus Community Edition) ప్రస్తుతం మార్కెట్లో కేవలం 1000 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కేవలం ఒకే స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఫీచర్ల పరంగా గతంలో విడుదల చేసిన మొబైల్ లో ఉన్న ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ కి సమానమైనప్పటికీ కొన్ని మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ కమ్యూనిటీ ఎడిషన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ చూస్తే.. దీనిని కంపెనీ 6.7 అంగుళాల FHD+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లేతో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా కలిగి ఉంటుంది. ఇక ఇది 30- 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ సపోర్టుతో లభిస్తోంది.. అలాగే 2412*1084 పిక్సల్స్ రిజల్యూషన్‌తో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని కలిగి ఉంటుంది.
ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ OS 2.6 పై పని చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మొబైల్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో చిప్‌సెట్‌ను కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా ఇది కేవలం ఒక స్టోరేజ్ వేరియంట్ లోనే లభిస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. నథింగ్ కంపెనీ దీనిని 5000mAh బ్యాటరీతో విడుదల చేసింది. అలాగే 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా అందిస్తోంది. ఈ మొబైల్ లో రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ను కూడా తీసుకువచ్చింది. ఇక ఇది కేవలం 256GB వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది.
ప్రస్తుతం ఈ స్పెషల్ ఎడిషన్ భారత దేశంలోనే కాకుండా అమెరికా, బ్రిటన్ తో పాటు మరికొన్ని దేశాల్లో అందుబాటులో ఉంది. ఇక ఈ మొబైల్ 256 జీబీ వేరియంట్ ధర మార్కెట్లో రూ.29,999 గా ఉంది. దీనిని దివాళి ఆఫర్స్ లో భాగంగా కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది.