Diwali Lucky Zodiac Signs: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది దీపావళికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అరుదైన శుభ రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా 4 శుభ రాజయోగాలు ఏర్పడనుండటంతో 5 రాశులకు దశ తిరగనుంది. ఈ ఐదు రాశులకు ఊహించని సంపద వచ్చి పడుతుంది.
ఇవాళ అక్టోబర్ 31 జ్యోతిష్యం రీత్యా అత్యంత ప్రాధాన్యత కలిగింది. ఓవైపు దేశమంతా దీపావళి సంబరాలు జరుపుకుంటుంటే మరోవైపు 4 అద్భుతమైన రాజయోగాలు ఏర్పడనున్నాయి. నవపంచమి రాజయోగం, గురు శుక్ర గ్రహాల కలయికతో సంసప్తక రాజయోగం, శశ మహా రాజయోగం, లక్ష్మీ యోగం ఉన్నాయి. ఈ నాలుగు రాజయోగాలు 5 రాశుల వారి జీవితంలో లక్ష్మీ కటాక్షానికి కారణమౌతున్నాయి. అందుకే ఈ 4 రాశులపై ఊహించని సంపద వచ్చి పడనుంది.
వృషభ రాశి వృషభ రాశి జాతకులకు ఇవాళ ఏర్పడనున్న శశ మహారాజయోగం కారణంగా అత్యంత లాభం కలగనుంది. ఎప్పట్నించో ఉన్న వివాదాలు పరిష్కారమౌతాయి. పెట్టుబడులకు అత్యంత అనువైన సమయం. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. కుటుంబీకులతో మంచి సమయం గడుపుతారు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆకశ్మిక ధనలాభం కలగడంతో ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు.
తులా రాశి తులా రాశి జాతకులకు అత్యంత అనువైన సమయం. ఈ రాశివారికి గోల్డెన్ డేస్ ప్రారంభమౌతాయి. ఆదాయం పెరుగుతుంది. ఊహించని డబ్బు చేతికి అందుతుంది. ఆర్ధికంగా అన్ని విధాలుగా బాగుంటుంది. ఇంట్లో అందరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులు లాభాల్ని తెచ్చిపెడతాయి. విద్యార్ధులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు
కన్యా రాశి కన్యా రాశి జాతకులకు సంసప్తక రాజయోగం కారణంగా ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. ఊహించని సంపద వచ్చి పడుతుంది. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది కలగదు. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్ధులు అందరికీ లాభదాయకంగా ఉంటుంది. ఇంట్లో అందరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెండింగులో ఉన్న డబ్బులు చేతికి అందుతాయి.
కుంభ రాశి దీపావళి కుంభ రాశి జాతకులకు లాభదాయకం. అప్పులు బాధ పోతుంది. ఊహించని రూపంలో వచ్చి పడే సంపదతో ఆర్ధికంగా లాభపడతారు. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు చేసినా ప్రయోజనం కలుగుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యపరంగా బాగుంటారు. ఎలాంటి సమస్యలు వెంటాడవు.
మిథున రాశి ఈ దీపావళి రోజున ఏర్పడనున్న శుభయోగాల కారణంగా ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం కానుంది. జీవితంలో ఎదురుండదు. అద్బుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారులు కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ఉద్యోగులు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలు పొందుతారు. అధిక లాభాలు ఆర్జిస్తారు. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు.