KTR Press Meet: అది ఇంట్లో చేసుకున్న దావతయ్యా.. బావ మరిది పార్టీపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

KTR First Reaction About His Brother In Law Farm house Party: తన బావ మరిది ఫామ్‌హౌస్‌లో పార్టీ వార్తలపై తొలిసారి మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 27, 2024, 09:23 PM IST
KTR Press Meet: అది ఇంట్లో చేసుకున్న దావతయ్యా.. బావ మరిది పార్టీపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Raj Pakala Farm House: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తన బావ మరిది ఫామ్‌హౌస్‌లో పార్టీ అంశంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న హడావుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరగకుండానే రాద్ధాంతం.. ప్రజలను దృష్టి మరల్చేందుకు దీన్ని వాడుకున్నారని వివరించారు. ఈ సందర్భంగా తన బావ మరిది ఇంట్లో జరిగింది రేవ్‌ పార్టీ కాదని స్పష్టం చేశారు. అది రేవ్ పార్టీ కాదని.. ఇంట్లో చేసుకున్న దావత్ అని స్పష్టం చేశారు.

Also Read: Rave Party Latest Live Updates: మాజీమంత్రి కేటీఆర్‌ బావ మరిది ఫామ్‌హౌస్‌ రేవ్‌ పార్టీ లైవ్‌ అప్‌డేట్స్‌..

'అది ఇంట్లో జరిగిన పార్టీ. మా బావ మరిది కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. గృహ ప్రవేశం చేసినప్పుడు అందరినీ పిలవలేకపోయిండు. దసరా, దీపావళి సందర్భంగా బంధుమిత్రులను పిలిచి దావత్‌ ఇచ్చుకున్నాడు. అంతే!. ఇది కుటుంబసభ్యులతో కలిసి ఏర్పాటుచేసుకున్న విందు. అందులో పాల్గొన్నవాళ్లంతా కుటుంబసభ్యులే. మహిళలు, పురుషులు కాదు. మొత్తం భార్యాభర్తలు పాల్గొన్నారు. దీనిపై ఇంత దుష్ప్రచారం చేయడం దుర్మార్గం' అని కేటీఆర్‌ తెలిపారు.

Also Read: Raj Pakala: బావమరిది రేవ్‌ పార్టీలో కేటీఆర్‌, ఆయన భార్య శైలిమ లేరు

ఇంట్లో జరిగిన దావత్
'మా కుటుంబ సభ్యులను ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతారా?. ప్రజా జీవితంలో ఉంటే ఇలాంటివి చేయాల్నా' అని కేటీఆర్‌ నిలదీశారు. 'వాళ్ల ఇంట్లో.. వాళ్ల అమ్మ, దోస్తులను పిలిచి దావత్‌ ఇస్తే ఇంత రాద్ధాంతం చేయడమా?' అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు, పాలనపై సోయి లేకుండా ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేయడం దారుణమని ఖండించారు. ఈ సందర్భంగా మీడియా వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్టు రాయడం.. ఇంట్లోవాళ్లను అతి దారుణంగా మాట్లాడడం ఏమిటిది? అని ప్రశ్నించారు.

ఇంట్లో దావత్ కు పర్మిషన్?
'ఇంట్లో దావత్ చేసుకుంటే కూడా పర్మిషన్ తీసుకోవాలంట? ఇదెక్కడి రూలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. డ్రగ్స్ లాంటివి ఏమీ దొరకలేదని స్వయంగా పోలీసులే చెప్పారు. మరి అలాంటప్పుడు ఎలా అంటారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలా చేయడం దారుణం' అని కేటీఆర్ తెలిపారు. ఎన్ని చేసినా.. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కేసీఆర్ నేర్పిన నీతి, నైతిక విలువలతో తాము రాజకీయాల్లో కొనసాగుతున్నామని తెలిపారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook

Trending News