Bank Holidays: బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ముందుగానే మీ పనులు పూర్తి చేసుకోండి..

Diwali Bank Holidays: బ్యాంకుల్లో మీకు ఏవైనా పనునలు ఉన్నాయా? అయితే వెంటనే పూర్తి చేసుకోండి.. ఎందుకంటే మళ్లీ వరుసగా సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో మీ బ్యాంకు పనులు ఆగిపోవచ్చు. దీపావళి సందర్భంగా మన దేశంలో ఉన్న అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు వరుసగా 3 రోజులు బంద్‌ ఉండనున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /7

ఇప్పటికే దసరా పండుగ ఇతర స్థానిక పండుగల నేపథ్యంలో అక్టోబర్‌ నెలలో కేవలం 15 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఈ నెల చివరకు వచ్చేస్తుంది.   

2 /7

దీపావళి పండుగ ఈ ఏడాది అక్టోబర్‌ 31న రానుంది. అంగరంగ వైభవంగా నిర్వహించుకునే దీపావళి పండుగకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవులు ఉంటాయి.   

3 /7

అయితే, దీపావళికి వరుసగా మూడు రోజులపాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఈ సందర్భంగా మీకు ఏవైనా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పనులు ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి. లేదంటే ఇబ్బందులు పడతారు.  

4 /7

సాధారణంగా బ్యాంకులకు సెలవులు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం ఉంటాయి. ఏడాది సెలవులకు సంబంధించిన కేలండర్‌ను ముందుగానే రిజర్వ్‌ బ్యాంకు విడుదల చేస్తుంది. దీని ప్రకారమే సెలవులు ఉంటాయి. ఇదికాకుండా నెగోషియబుల్ ఇన్‌స్ట్రూమెంట్‌ యాక్ట్‌ ప్రకారం కూడా సెలవులు ఉంటాయి.  

5 /7

అంటే స్థానిక పండుగల ఆధారంగా కూడా బ్యాంకులకు సెలవులు వర్తిస్తాయి. అయితే, దీపావళి పండుగ అక్టోబర్‌ 31వ తేదీ గురువారం రానుంది. కొన్ని ప్రాంతాల్లో నవంబర్‌ 1న జరుపుకోనున్నారు.  

6 /7

అయితే, నవంబర్‌ 2వ తేదీ కూడా లక్ష్మీ పూజ చేస్తారు. కొంతమంది గోవర్థన పూజ నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఆరోజు కూడా బంద్‌. తెలుగు రాష్ట్రాల్లో అయితే, అక్టోబర్‌ 31న దీపావళి పండుగ సెలవు వచ్చింది.   

7 /7

ఇటీవలె బ్యాంకులకు కేవలం 5 రోజులు పనిదినాలను కూడా ఈ ఏడాది చివరిలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. లేదా కొత్త ఏడాది ప్రారంభంలో అమలు చేస్తారు. దీంతో ప్రతిరోజూ 45 నిమిషాల పని సమయం బ్యాంకు ఉద్యోగులకు పెరుగుతుంది. ప్రతి శనివారం, ఆదివారం బ్యాంకులు సెలవు ఉండనున్నాయి.