Sitaphal during pregnancy : చాలామందికి సీతాఫలం అంటే ఎంతో ఇష్టం. మరి శీతాకాలం గర్భం దాల్చిన వాళ్లు తినొచ్చా లేదా.. చూద్దాం.
సీతాఫలం కాలం వచ్చేసింది. ఎక్కడ చూసినా సీతాఫలాలే కనిపిస్తున్నాయి.
ఇక ఈ సీజన్ తప్పిస్తే మళ్లీ ఈ పండు తినడానికి సంవత్సరం రోజులు వేచి చూడాలి.మరి అలాంటి ఈ పండ్లు గర్భవతులు తినొచ్చా లేదా చూద్దాం.
సీతాఫలాలు ప్రెగ్నెన్సీ మహిళల్లో ఉదయాన్నే వాంతులు, వికారం లాంటి సమస్యలను తగ్గిస్తాయి.
సీతాఫలంలో పుష్కలంగా లభించే.. విటమిన్ బి6 ఈ సమస్య తగ్గించడంలో సాయపడుతుంది.
అంతేకాకుండా రోజుకి ఒక శీతాకాలం తినడం ద్వారా..ప్రెగ్నెన్సీలో చాలా మంది మహిళల్లో ఎదుర్కొనే మలబద్దకం సమస్య నుంచి బయటపడవచ్చు.
సీతాఫలంలో ఉండే అధిక పీచు జీర్ణశక్తిని పెంచి మల బద్దకం సమస్య పూర్తిగా తగ్గిస్తుంది. అయితే సీతాఫలంలో తీపు ఉండడం వల్ల.. ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ బారిన పడినవారు మాత్రం ఈ పండుకి దూరంగా ఉండాలి.
మిగతా గర్భిణీ స్త్రీలు ఈ పండు తినడం ద్వారా ద్వారా ఎన్నో లాభాలు పొందొచ్చు