అమరావతి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి(MGNREGA) సంబందించిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ధర్నాకు దిగారు. ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్వర్యంలో టిడిపికి చెందిన శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు వెంటనే నిధులు విడుదల చేయాలని నిరసన తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం క్రింద తెలుగుదేశం హాయంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించకపోవడాన్ని తప్పుపడుతూ జగన్ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు.
టీడీపీ సర్కార్ హాయాంలో జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం సరికాదన్నారు. కేంద్ర సర్కార్ విడుదల చేసిన నిధులను ఇతర అవసరాలకు వాడుతూ పాత బిల్లులు చెల్లించకపోవడాన్ని టీడీపీ తప్పుపట్టింది.