న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 7 లక్షల ఉద్యోగాలు(Central govt jobs) ఖాళీగా ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్(Union minister Jitendra Singh) వెల్లడించారు. గత ఏడాది మార్చి 1 నాటికి మొత్తం 6 లక్షల 83వేల 823 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్ శీతాకాల సమావేశాల(Parliament winter session 2019) సందర్భంగా ఆయన రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాచారంలో తెలిపారు. ఇందులో ప్రస్తుత 2019-20 ఏడాదిలో దాదాపు 1.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్‌మెంట్(Staff Selection Commission recruitment) ప్రక్రియ చేపట్టినట్టు మంత్రి సభకు తెలిపారు. ఎస్‌ఎస్‌సి, ఆర్‌ఆర్‌బి, సీఈఎన్‌ల ద్వారా ఖాళీలను భర్తీ చేసే నియామక ప్రక్రియ పురోగతిలో ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వివరించారు.
కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం గ్రూప్ సీలో మొత్తం 5,74,289, గ్రూప్ బీలో 89,638 గ్రూప్ ఏ విభాగంలో 19,896 ఉద్యోగాలు భర్తీ కావల్సి ఉంది. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబిసి) బ్యాక్ లాగ్ రిజర్వు పోస్టుల్లో కూడా ఖాళీలు ఉన్నాయని మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంలో 7 లక్షల ఉద్యోగాలు ఖాళీ!