Shanidosh ke upay: శనివారం శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజని చెప్తుంటారు. ఈరోజున ఏ పనిచేసిన ఆయన చల్లని చూపుతో అనుగ్రహిస్తాడంటారు.
శనీశ్వరుడు సూర్యుడి కుమారుడు. నవగ్రహాలలో శనీశ్వరుడ్ని పవర్ ఫుల్ గ్రహాం అంటారు. ఆయన మనం చేసుకున్న కర్మలను బట్టి ఫలితాలు ఇస్తుంటాడు.
ఆయన.. మంచి పనులు చేస్తే మంచి, చెడు కర్మలు చేస్తే అలాంటి ఫలితాలను ఇస్తాడంటారు. అందుకే ఎప్పుడు కూడా ఒకరికి హనీ తలపెట్టే పనుల్నిన చేయకూడదని చెప్తుంటారు.
అయితే.. ప్రతి ఒక్కరి జీవితంలో కొంత కాలం శనీపీడ ఉంటుంది. కొందరికి అర్దష్టమ, ఏలినాటీ, సాడేసాతి రూపంలో శనీశ్వరుడు వేధిస్తుంటాడు. దీని వల్ల కొంత మందికి లేని కష్టాలు తలెత్తుతాయి.
ఈ కాలంలో రాజులు పేదవాడిగాను, పేదవాడు రాజులాగాను మారుతాడంటారు. అందుకే ఈ కాలంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలంటారు. శనీ పీడ నుంచి బైటపడేందుకు కొన్ని పరిహారాలను పాటించాలని పండితులు చెప్తుంటారు.
శనీవారం రోజున నల్ల నువ్వులతో శనీకి తైలాభిషేకం చేయాలి. అదే విధంగా నవధాన్యాలను పండితులకు దానంగా ఇవ్వాలి. నల్లని బట్ట దానంగా ఇవ్వాలి. అంతేకాకుండా శివుడికి అభిషేకం కూడా చేయాలి.
శనిదేవుడి వాహానమైన కాకికి ఏదైన తినేందుకు ఇవ్వాలి. శునకానికి రోట్టేలు, పేదవాళ్లకు అన్నదానం, వస్త్రదానం చేయాలి. ఇలా చేస్తే జీవితంలో వచ్చే ఒడిదుడుకుల నుంచి బైటపడొచ్చని చెప్తుంటారు.
అందుకు శనీవారం రోజున తప్పనిసరిగా దశరథుడి చేత చెప్పబడిని శనీ స్తోత్రాలు కూడా చదవాలి. ట్రాన్స్ జెండర్ లకు ఏదైన దానంగా ఇవ్వాలి. శనీవారం రోజు నల్ల చీమలకు బెల్లం, చక్కెరలను తినేందుకు పెట్టాలి. ఇలా 11 లేదా 21 వారాలు చేస్తే శనీదోషం నుంచి బైటపడతారని పండితులు చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)