Tops 5 Savings Schemes: ఇండియా పోస్టు అందించే దీర్ఘకాలిక సేవింగ్స్ సర్టిఫికెట్లలో కిసాన్ వికాస్ పత్రం కూడా ఒకటి. ముఖ్యంగా రైతుల్లో పొదుపును ప్రోత్సహించేందుకు పోస్టల్ డిపార్ట్ మెంట్ ఈ స్కీమును అమల్లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ స్కీముపై 7.5శాతం వడ్డీ అందిస్తోంది. ఈ స్కీములో మీరు పెట్టుబడి నేరుగా 9ఏళ్లు 5 నెలల్లో రెట్టింపు అవుతుంది.
Savings Schemes: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది. సుకన్య సమృద్ధి యోజన, SCSS, కిసాన్ వికాస్ పత్ర, NPS, NSC, PPF వంటివి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని ప్రధాన పొదుపు పథకాలు ఇవి. ప్రభుత్వ పథకాలలో పెట్టుబడికి పూర్తి భద్రత లభిస్తుందని..అందులో డబ్బును కోల్పోయే ప్రమాదం ఉండదని చాలా మంది వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రభుత్వ పథకాలను సామాన్యులు ఎక్కువగా విశ్వసించటానికి ఇదే కారణం. అయితే ఈ స్కీములన్నింటిలో అత్యధిక వడ్డీ పొందుతున్న ఆ 5 ప్రభుత్వ స్కీముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కిసాన్ వికాస్ పత్ర: కిసాన్ వికాస్ పత్ర (KVP) అనేది ప్రభుత్వ పొదుపు పథకం. ప్రస్తుతం ఈ పథకంపై 7.5 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ పథకంలో మీ పెట్టుబడి నేరుగా 9 సంవత్సరాల 5 నెలల్లో రెట్టింపు అవుతుంది. మీరు ఈ స్కీమ్‌లో ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేసినా, 9 సంవత్సరాల 5 నెలల తర్వాత మీ డబ్బు రెట్టింపు అవుతుంది.
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్: బ్యాంకుల FD లాగా, TD అంటే టైం డిపాజిట్ ఖాతాలు పోస్టాఫీసులలో ఒపెన్ చేస్తారు. ప్రస్తుతం, 5 సంవత్సరాల కాలవ్యవధితో టైమ్ డిపాజిట్లపై పోస్టాఫీసులో 7.5 శాతం వడ్డీ ఇస్తోంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ : నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది ప్రభుత్వ పొదుపు పథకం. ఈ పథకం 5 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. ఈ పథకంపై 7.7 శాతం వడ్డీ ఇస్తారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా, ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్: సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS)లో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మాత్రమే ఈ ఖాతాలు తెరిచేందుకు అర్హలు. ఈ పథకంలో, సీనియర్ సిటిజన్లకు 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో గరిష్టంగా రూ. 30 లక్షల పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీము 5ఏళ్లపాటు అమల్లో ఉంటుంది.
సుకన్య సమృద్ధి యోజన (SSY) కింద 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలకు మాత్రమే ఖాతాలు తెరుస్తారు. ఈస్కీము కింద ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. కూతుళ్ల కోసం నిర్వహిస్తున్న ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం 8.2 శాతం వడ్డీ ఇస్తోంది.