మూవీ రివ్యూ: రివైండ్ (Rewind)
నటీనటులు: సాయి రోనక్, అమృత చౌదరి, సురేష్, జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ తదితరులు
తదితరులు
ఎడిటర్: తుషార పాలా
సినిమాటోగ్రఫీ: శివ రామ్ చరణ్
సంగీతం: ఆశీర్వాద్
నిర్మాత: కళ్యాణ్ చక్రవర్తి (క్రాస్ వైర్ క్రియేషన్స్)
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కళ్యాణ్ చక్రవర్తి
విడుదల తేది: 18-10-2024
సాయి రోనక్ హీరోగా అమృత చౌదరి హీరోయిన్ గా క్రాస్ వైర్ క్రియేషన్స్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం ‘రివైండ్’. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను ‘రివైండ్’ మూవీ అందుకుందా లేదా అనేది చూద్దాం.
కథ విషయానికొస్తే..
శాంతి (అమృతా చౌదరి) వాళ్ల తాత కృష్ణమూర్తి ఫిజిక్స్ లో లెక్చరర్. ఆయన ఎంతో ఇష్టపడి ఓ టైమ్ ట్రావెల్ మిషన్ ను తయారు చేస్తాడు. ఆ టైమ్ ట్రావెల్ మిషన్ తో 1980 నుంచి 2019లోకి ట్రావెల్ చేసి వస్తాడు. ఆ టైమ్ ట్రావెల్ మిషన్ కార్తీక్ (సాయి రోనక్) వాళ్ల నాన్న (సురేష్) కు దొరుకుతుంది. కట్ చేస్తే 2024లో కథ మొదలవుతోంది. అక్కడ శాంతి, కార్తీక్ ఇద్దరు పరస్పరం తొలి చూపులోనే ప్రేమించుకుంటారు. కానీ వీళ్ల ప్రేమకో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. దానికి టైమ్ ట్రావెల్ మిషన్ ఎలా సహాయ పడింది. ఈ నేపథ్యంలో జరిగిన స్టోరీనే ‘రివైండ్’ మూవీ కథ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
తెలుగులో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చాయి. వీటన్నంటికీ ప్రేరణ సింగీతం దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘ఆదిత్య 369’ ప్రేరణ అని చెప్పాలి. దర్శకుడు తాను అల్లుకున్న కథకు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ను వాడుకోవడం బాగుంది. ఒక చిన్న లైన్ లో ఎవరి దగ్గర డైరెక్టర్ గా పని చేయకుండా తాను చెప్పాల్సిన కథను తెరపై ఆవిష్కరించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రేక్షకుల మెదళ్లకు ఓ పజిల్ ఇచ్చి.. సెకండాఫ్ లో ఆ పజిల్ ను ఎలా పూర్తి చేసుకుంటూ వచ్చాడనేది ఆసక్తికర అంశం. ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే అతి ముఖ్యమైనది. ఈ విషయంలో దర్శకుడు అభిరుచిని మెచ్చుకోవాలి. అయితే.. ఓ మాములు లవ్ స్టోరీకి ఈ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అప్లై చేసి ఎక్స్ క్యూట్ చేయడం మాములు విషయం కాదు. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా ఆ పనిని పూర్తి చేసాడు. ఇందులో ఇంకాస్త తెలిసిన నటీనటులు ఉంటే సినిమా వేరే లెవల్లో ఉండేది. కానీ ఉన్నంతలో అందరి నటీనటులతో మంచి నటననే రాబట్టుకొన్నాడు. ఫ్లాష్ బ్యాక్ సీనియర్ హీరో సురేష్, హీరో మధ్య తండ్రీ కొడుకుల ఎమోషనల్ సాంగ్ అందరికీ కనెక్ట్ అవుతోంది. అలాగే సాఫ్ట్ వేర్ జాబ్ వద్దురా అంటే సాగే పాట బాగుంది. మొత్తంగా దర్శకుడిగా తొలి సినిమాతోనే ఏదో రొటీన్ స్టోరీనే అటు ఇటు తిప్పి ప్రేక్షకులపై రుద్దడం కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రావడం మెచ్చుకోదగ్గ అంశం. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఎడిటర్ ఫస్ట్ హాఫ్ ఇంకాస్త క్రిస్పీగా ట్రిమ్ చేసి ఉంటే మరింత బాగుండేది. ఫస్ట్ హాఫ్ సరద సరదగా సాగిపోయినా.. సెకండాఫ్ లో తండ్రీ కొడుకుల ఎమోషన్.. క్లైమాక్స్ ట్విస్ట్... సీక్వెల్ కు కథ ఉందని చెప్పడం బాగుంది. మొత్తంగా తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్నాడనే చెప్పాలి. మొత్తంగా వల్గారిటీ, డబుల్ మీనింగ్ సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కుటుంబ ప్రేక్షకులు కలిసి చూడదగ్గ చిత్రం అని చెప్పాలి.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
నటీనటుల విషయానికొస్తే..
కార్తీక్ పాత్రలో నటించిన సాయి రోనక్.. తనదైన ఈజ్ తో మెప్పించాడు. హీరోగా అతని లుక్స్ బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో అనుభవం ఉన్న నటుడి పరిణితి చూపించాడు. శాంతి పాత్రలో నటించిన అమృతా చౌదరి క్యూట్ లుక్స్ తో అట్రాక్ట్ చేసింది. తొలి సినిమా అయినా.. నటనతో మెప్పించింది. సీనియర నటుడు సురేష్.. తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమా తర్వాత ఆయన్ని వరుసగా తండ్రి పాత్రలు పలకరించడం పక్కా అని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్
కథనం,
నిర్మాణ విలువలు
పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్
అక్కడక్కడ బోర్ కొట్టే సీన్స్
పంచ్ లైన్ .. రివైండ్.. ఆకట్టుకునే టైమ్ ట్రావెల్ మూవీ..
రేటింగ్: 3/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter