5 Days Working in Bank: బ్యాంకు ఉద్యోగులకు బంపర్ న్యూస్‌ .. ఇక ఆ నెల నుంచి కేవలం 5 రోజులే వర్కింగ్ డేస్..!

5 Days Working in Bank Big update: బ్యాంకు ఉద్యోగులకు 5 రోజులే పని దినాలు కేటాయించాలని ఎన్నో రోజులుగా వారి నుంచి ఈ డిమాండ్ వస్తోంది. అయితే వారికి ప్రభుత్వం నుంచి ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ త్వరలో ఇవ్వనుంది. ఈ సంవత్సరం చివర్లో ఈ 5 రోజుల పని దినాన్ని అమలు అయ్యే అవకాశం ఉంది. ఎందుకో తెలుసా?    
 

1 /7

ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఎన్నో రోజులుగా కోరుతున్న ఐదు రోజుల పని దినాల కోసం బిగ్ అప్డేట్ వచ్చింది. కేవలం ప్రభుత్వం అప్రూవ్ చేయడమే మిగిలింది. దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి.   

2 /7

ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఐదు రోజుల పని దినాలు అమలు కావచ్చు. కేంద్రం ఈ 5 రోజుల వర్కింగ్ ని అప్రూవ్ చేస్తే ఇక బ్యాంకు ఉద్యోగులకు కేవలం 5 రోజులే పని దినాలు కానున్నాయి.  

3 /7

ఈ నిర్ణయానికి సంబంధించి ఇప్పటికే ఐబీఏ, యూనియన్ అసోసియేషన్ 2023లో ఒప్పందానికి వచ్చాయి. అన్ని పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులో కేవలం ఐదు రోజులే పని దినాలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రతి శనివారం ఆదివారం బ్యాంకు ఉద్యోగులకు సెలవు రానుంది.   

4 /7

ఈ ఐదు రోజుల పనిని దినాలకు సంబంధించి ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం కూడా ఎంతో కీలకం. ఎందుకంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అన్ని ఆర్‌బీఐ చూసుకుంటుంది. కాబట్టి అయితే ఈ ఏడాది చివర్లోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రానున్నట్లు తెలుస్తోంది.  

5 /7

 అయితే ఈ ఐదు రోజుల పని దినాలకు డిమాండ్ అమల్లోకి వస్తే బ్యాంకింగ్ వర్కింగ్ టైమింగ్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ప్రతిరోజు ఒక 40 నిమిషాలు అదనంగా పని చేయాల్సి వస్తుంది. ఉదయం 9:45 నుంచి సాయంత్రం 5:30 వరకు బ్యాంకు ఉద్యోగులు పని చేయాల్సి వస్తుంది. వారు ప్రతి శని ఆదివారాలు సెలవు తీసుకోవచ్చు.  

6 /7

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ 5 దినాల పని రోజుల అమలు ఈ ఏడాది చివరి లేదా 2025 ప్రారంభంలోనే జరగనుందని తెలుస్తోంది. అయితే నెగోషియబల్ ఇన్స్ట్రుమెంట్ ప్రకారం శనివారం సెలవు దినం గా గుర్తించింది. అంటే ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుందని అర్థం.  

7 /7

2015 నుంచి ఈ శనివారం, ఆదివారం సెలవులు ప్రకటించాలని బ్యాంకు యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయి. 10వ ద్వైపాక్షిక అగ్రిమెంట్ ప్రకారం అప్పటి నుంచే ప్రతి రెండో ,నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులు లభిస్తున్నాయి