Putnala Chutney Recipe: ఉదయం బిజీగా ఉండి హడావుడిగా ఉంటారు. ఒకవైపు స్కూలు, మరోవైపు ఆఫీసులు. బ్రేక్ ఫాస్ట్ లోకి ఏ టిఫిన్ తినాలని ఆలోచిస్తారు. అయితే, టిఫిన్‌కు సరిపోయే చట్నీ గురించి కూడా సందిగ్ధంలో ఉంటారు. అయితే, ఇంట్లోనే హోటల్ స్టైల్‌లో పుట్నాలతో చట్నీ తయారు చేసుకుంటే రుచి అదిరిపోతుంది. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, ఉప్మాలోకి కూడా వేసుకుని తింటే ఆహా.. అనాల్సిందే.. మరి పుట్నాల చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా?
పుట్నాల చట్నీకి తయారీకి కావాల్సిన పదార్థాలు.. పుట్నాలు- కప్పు, పల్లీలు -అరకప్పు, పచ్చిమిర్చి-10, వెల్లుల్లిరెబ్బలు-3, చింతమండి-కొద్దిగా, కొత్తమీరా-కొద్దిగా, నూనె, అవాలు,జిలకర్ర, శనగపప్పు, ఉప్పు- రుచికి సరిపడా, కరివేపాకు, నీళ్లు, ఇంగువ, చనగపప్పు.
ఇంట్లో నిత్యం అందుబాటులో ఉండే ఈ ఆహార పదార్థాలతోనే రుచికరమైన పుట్నాల చట్నీ తయారు చేసుకోవచ్చు. పుట్నాలు డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ చట్నీ బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే ఎంతో టేస్టీ కూడా.
చట్నీ తయారీ విధానం.. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి పుట్నాలను సన్నని మంటపై వేయించాలి. ఆ తర్వాత వాటిని తీసి పక్కన పెట్టి, పల్లీలు వేయించాలి. ఆ తర్వాత ఒక చెంచా నూనె వేసి పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. కొత్తిమీరా కూడా వేయించాలి.
ఆ తర్వాత వీటిని చల్లారనివ్వాలి. ఒక మిక్సీ తీసుకుని అందులో వేయించిన మిక్చర్‌ను వేసి కాస్త ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, జిలకర్ర కొద్దిగా చింతపండు కూడా వేసి తగినన్ని నీళ్లు పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత తాలింపు వేసుకోవాలి. ఒక చిన్న తాలింపు గిన్నె స్టవ్ ఆన్ చేసి పెట్టి అందులో నూనె ఆవాలు, జిలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, చనగపప్పు గింజలు, ఇంగువ, వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత చట్నీలో ఈ తాలింపు వేసుకుంటే రెడీ. వేడివేడి ఇడ్లీ, దోశల్లో ఈ చట్నీ వేసుకుని తింటే అదరహో అనాల్సిందే..