Masala Egg Pulusu Recipe : ఎప్పుడైనా గుడ్డుకూర తయారు చేసుకున్నప్పుడు ఎక్కువ శాతం గుడ్డు కూర, కోడు గుడ్డు కుట్టు, ఆమ్లెట్ వంటివి తయారు చేసుకుంటాం. కానీ, ఈసారి ఎప్పుడూ ఒకేవిధంగా తయారు చేసుకునే కోడి గుడ్డు పులుసు కాకుండా ఈసారి కాస్త వెరైటీగా, ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ మసాలా గుడ్డు పులుసు తయారు చేసుకోండి. ఇకపై మీరు ఎప్పుడు గుడ్డుకూర తయారు చేసినా ఇలానే చేస్తారు.
Masala Egg Pulusu Recipe : కోడిగుడ్డు పులుసు తయారు చేయడానికి ఎక్కువ పదార్థాలు ఏం వాడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. దీని రుచి మాత్రం ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో వస్తుంది. ఈ రుచికరమైన గుడ్డు పులుసు రిసిపీ ఎలా తయారు చేయాలి? కావాలసిన పదార్థాలు ఏంటి? తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు.. గుడ్లు -నాలుగు, టమోటాలు-2, ఉల్లిగడ్డలు-2, కారం స్పూన్, పసుపు అరస్పూన్, ధనియాల పొడి స్పూన్, జిలకర్ర పొడి స్పూన్, మెంతులు అరటీస్పూన్, గరం మసాలా పొడి - టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, ఉప్పు- రుచికి సరిపడా, నూనె గ్రేవీ తగ్గట్టు, కరివేపాకు, కొత్తిమీరా, నిమ్మకాయంత చింతపండు రసం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గుడ్లు ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని మరో బాండీలో వేసి నూనె, పసుపు, కారం, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని తీసి పక్కనబెట్టుకోవాలి.
ఇప్పుడు మరో ప్యాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు, మెంతిగింజలు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇందులోనే పసుపు, కారం వేయాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు, ఉప్పు, ధనియాలు, జీలకర్ర కూడా వేయాలి.
నూనె పైకి తేలే వరకు టమోటాలను బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసం కూడా వేసి మరో కొన్ని నిమిషాలు బాగా ఉడికించాలి. చివరగా గుడ్లు, గరం మసాలా వేసి కావాలిస్తే నీరు పోసి మరో ఐదు నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు మీరు ఉప్పు కూడా రుచి చూసి సరిచేసుకోవచ్చు.
ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే రుచికరమైన రాయాలసీమ స్పెషల్ కోడి గుడ్డు పులుసు రెడీ అయినట్లే. ఇందులో కొంతమంది టమోటాలు వేసుకోరు. అలా వద్దనుకుంటే స్కిప్ చేసి పులుసు తయారు చేసుకోవచ్చు. దీని రుచి కూడా అదిరిపోతుంది.