Best Mileage Bikes Under 1.5 Lakh : మీరు లక్షన్నర బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ లేదా స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చాలా బైకులు, స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో లేటెస్ట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ ఉండి, ఎక్కువ మైలేజీ ఇచ్చే టాప్ 10 వెహికల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350:
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైకులో 349.34 సీసీ బిఎస్6 ఇంజిన్ ఉంటుంది. ఇది 202.2 బీహెచ్ పీ పవర్ 27ఎన్ఎం జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో జోడించి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్, బ్యాక్ సైడ్‌లో డిస్క్ బ్రేకులు ఉంటాయి. అంతేకాదు దీంట్లో యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ బైకులో 13 లీటర్ల కెపాసిటీ ఉన్న ఫ్యూయెల్ ట్యాగ్ కూడా ఉంటుంది. 350 సీసీ బైకుల్లో 36 కిలోమీటర్ లీటర్ కు మైలేజ్ ఇచ్చే టూవీలర్ ఇది. అందులో ఇది బెస్ట్ మైలేజ్ బైకుల జాబితాలో స్థానం సంపాదించింది. ప్రస్తుతం ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మూడు వేరియంట్లలో , ఎనిమిది రంగుల్లో ఉంటుంది. దీని ధర సుమారు రూ. 1,49, 000నుంచి రూ. 1,74, 430 ఉంటుంది.
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200:
ఈ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 మోటార్ సైకిల్ 199.5 సీసీ కెపాసిటి కలిగి ఉంటుంది. ఇందులో బి56 ఇంజిన్ కూడా ఉంటుంది. ఇది 24.13బీహెచ్ పీ పవర్, 18.74 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో జోడించి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్, బ్యాక్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. అంతేకాదు యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ బైకులో 12 లీటర్ల కెపాసిటీతో ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బండి లీటర్ పెట్రోల్ కు 36కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ బజాజ్ బైక్ మూడు వేరియంట్లలో 20 కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. ధర రూ. 1,42,060 నుంచి 1,58,438 వరకు ఉంటుంది.
హోండా హార్నెట్ 2.0:
హోండా హార్నెట్ 2.0 బైకులో 184.4 సీసీ కెపాసిటీతో బీఎస్6 ఇంజిన్ ఉంటుంది. ఇది 17.03 బీహెచ్పీ పవర్, 15.9 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో జోడించి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. యాంటీ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ బైకులో 12 లీటర్ల కెపాసిటి ఉన్న ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. లీటర్ కు 42.3 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ హోండా హార్నెట్ 2.0 బైక్ సింగిల్ వేరియంట్ నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ధర రూ. 1,40, 327 వరకు ఉంటుంది.
Also Read: Pension Scheme: కేంద్రం బంపర్ ఆఫర్.. ప్రతినెలా రూ.3000 పొందే సూపర్ హిట్ స్కీమ్..!
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ :
ఈ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ బైకులో 197.75 సీసీ కెపాసిటీతో బిఎస్6 ఇంజిన్ ఉంటుంది. ఇది 20.54 బీహెచ్పీ పవర్ 17.25 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్‌తో జోడించి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. అంతేకాదు ఇందులో యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ బైకులో 12 లీటర్ల కెపాసిటీతో ఫ్యూయోల్ ట్యాంక్ కూడా ఉంటుంది. ఈ బండి లీటర్ కు 41.9 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ టీవీఎస్ బైక్ సింగిల్ వేరియంట్లో రెండు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ధర రూ.1,49,920 వరకు ఉంది.
హీరో ఎక్స్‌ప్లస్ 200 4వీ:
ఈ హీరో ఎక్స్‌ప్లస్ 200 4వీ బైకులో 199.6 సీసీ కెపాసిటీతో బీఎస్6 ఇంజిన్ ఉంది. ఇది 18.9 బీహెచ్పీ పవర్, 17,35ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్‌తో జోడించి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. దీంట్లో యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటి 13 లీటర్లు ఉంటుంది. ఈ బండి 32.9 మైలేజీ ఇస్తుంది. ఈ బైక్ రెండు వేరియంట్లలో 13రంగుల్లో అందుబాటులో ఉంది. ధర రూ. 1,47,38 లక్షల నుంచి 1,54,763 వరకు ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook