Ind Vs Ban T20 Match Highlights: రెండో టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా అదరగొట్టింది. బంగ్లాదేశ్‌ను 86 పరుగుల తేడాతో ఓడించి.. సిరీస్‌ను సొంతం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 రన్స్‌కే పరిమితమైంది. బ్యాటింగ్‌లో.. బౌలింగ్‌లో దుమ్ములేపిన తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. కేవలం 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 74 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. బౌలింగ్‌లో నాలుగు ఓవర్లు వేసిన నితీశ్ కుమార్.. కేవలం 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. హార్థిక్ పాండ్యా తరువాత బౌలింగ్ ఆల్‌రౌండర్ కోసం ఎదురుచూస్తున్న భారత్‌కు నితీశ్ కుమార్ బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు.
Also Read: Ratan Tata: సామాన్యులకు సరమైన ధరలో కారు.. నష్టాలకు బాటలు.. అయినా తలొగ్గని టాటా..!
తొలి టీ20 మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నితీశ్ కుమార్.. రెండో టీ20లో మాత్రం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 25 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన నితీశ్ కుమార్.. రింకూ సింగ్‌తో కలిసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఓ వైపు వికెట్ కాపాడుకుంటునే సిక్సర్ల వర్షం కురిపించాడు. ఓ దశలో సెంచరీ మార్కు చేరుకునేలా కనిపించినా.. ముస్తాఫిజూర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. అనంతరం బౌలింగ్‌లో కూడా రెండు వికెట్లు పడగొట్టి గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండడం గొప్పగా అనిపిస్తోందని నితీశ్ కుమార్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో తన బెస్ట్ పర్ఫామెన్స్‌కు కారణం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్‌లేనని అన్నాడు. తాను ఎలాంటి భయం లేకుండా ఆడేందుకు స్వేచ్ఛనిచ్చారన్నాడు. తొలుత సెట్ అయ్యేందుకు సమయం తీసుకున్నానని.. ఆ తరువాత పరిస్థితులు తనకు అనుకూలంగా మారిపోయాయని చెప్పాడు. ఇదే జోరును భవిష్యత్‌లో కొనసాగించాలని అనుకుంటున్నానని అన్నాడు.
బంగ్లాదేశ్‌పై 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. టీ20 సిరీస్ కూడా క్లీన్ స్వీప్ చేసేందుకు రెడీ అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ అవుతుంది. మూడో టీ20 ఈ నెల 12న హైదరాబాద్ వేదికగా జరగనుంది.
Also Read: BSNL Plan: డేటా ఎక్కువ వాడేవారికి బంపర్ న్యూస్.. 365 రోజుల వ్యాలిడిటీతో రోజూ 2 జీబీ డేటా ఉచితం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి