Healthy Weight Gain Tips: సాధారణంగా చాలా మంది బరువు తగ్గాలని తాపత్రయం పడుతుంటారు. మరికొందరు మాత్రం ఎలా బరువు పెరగాలని ఆలోచిస్తుంటారు. బరువు పెరగడం కోసం వివిధ ప్రొడెక్ట్స్, మందులు, యోగా, వ్యాయామం, హెల్దీ డ్రింక్స్ అంటూ నానా కష్టాలు పడుతుంటారు. కొంతమంది జంక్ ఫుడ్స్, చీజ్ కలిగిన ఆహారపదార్థాలు, చాక్లెట్ లు తింటే బరువు పెరుగుతారని వీటిని అతిగా తీసుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల శరీరం చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే సహజంగా బరువు పెరగాలి అనుకొనేవారు కేవలం ఈ ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల సులువుగా బరువు పెరుగుతారని వైద్యులు చెబుతున్నారు. వీటిని ప్రతిరోజు డైట్లో చేర్చుకోవడం వల్ల సులువుగా 2 KG బరువు పెరగడం ఖాయం. ఇంతకీ ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం..
బరువు పెంచే ఆహార పదార్థాలు:
1. డ్రై ఫ్రూట్స్:
ఆరోగ్యనిపుణులు ప్రకారం ఉదయం ప్రతిరోజు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల సులువుగా బరువు పెరుగుతారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అందులో బాదం, పిస్తా, వాల్ నట్స్ తీసుకోవడం చాలా మంచిది. బరువు పెంచడంలో కీలక ప్రాత పోషిస్తాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. నేరుగా తినడానికి ఇష్టపడనివారు మిక్సీలో పొడి చేసుకొని పాలలో కలుపుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
2. డేట్స్:
డేట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజు ఒకటి తింటే సులువుగా బరువు పెరుగుతారని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు కేలరీలను పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా పొటాషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది అధిక కొవ్వును కరగించడంలో సహాయపడతుంది. బరువు తక్కువగా ఉన్నవారు ప్రతిరోజు ఖర్జూరం తినడం చాలా మంచిది. ఆరోగ్యకరమైన బరువు పెరగవచ్చు.
3. ఓట్స్:
డైట్ పాటించేవారు చాలామంది ఓట్స్‌ను ఎక్కువగా తీసుకుంటారు. దీని ప్రతిరోజు తినడం వల్ల బరువు పెరుగుతారు. ఇందులో నాలుగు వందల కేలరీలు ఉంటాయి. ఓట్స్‌లో ఫైబర్, ప్రోటీన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. కేవలం ఓట్స్ మాత్రమే కాకుండా ఇందులో క్రీమ్ మిల్క్, పండ్లు, డ్రై ఫూట్స్ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇది ఆరోగ్యకరమైన బరువును పెంచడంలో కీలక ప్రాత పోషిస్తుంది.
4. మొలకలు:
ప్రతిరోజు ఉదయం మొలకెత్తిన గింజలు తినడం వల్ల బరువు పెరుగుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మొలకల్లో పప్పు దినుసులను, శనగలు, పెసరపప్పు, గింజలు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో శరీరానికి మేలు చేస్తాయి. ప్రతిరోజు ఒక కప్పు మొలకలు తినడం వల్ల రెండు యాభై ఏడు కేలరీలు ఉంటాయి. బరువు పెంచడంలో కీలక ప్రాత పోషిస్తాయి.
Also Read: Oats Facts: ఓట్స్ ఇలా తింటే గుండె జబ్బులు తప్పవా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.