ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. తమిళ్, తెలుగు, హిందీలో 2025 అక్టోబర్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. విజయ్ లెగసీని దృష్టిలో పెట్టుకుని, ఆయన నటిస్తున్న చివరి సినిమాను అత్యంత భారీగా, తరతరాలు గుర్తుపెట్టుకునేలా తెరకెక్కించబోతున్నట్టు చెప్పారు.
ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. అనల్ అరసు యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. సెల్వ కుమార్ ఆర్ట్ డైరక్టర్‌గా పనిచేస్తున్నారు. పల్లవి సింగ్ కాస్ట్యూమ్స్ అందిస్తున్నారు. 'ధీరన్ అదిగారమ్ ఒండ్రు', 'మాస్టర్' సినిమాలకు పనిచేసిన సత్యన్ సూర్యన్.. దళపతి 69 ని మరో రేంజ్లో చూపిస్తారనే కాన్ఫిడెన్స్ ప్రేక్షకుల్లో ఉంది.
కేవీయన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. దాదాపు 30 యేళ్లుగా సిల్వర్ స్క్రీన్ పై వైవిధ్యమైన నటనతో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న విజయ్ కెరీర్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
గౌతమ్ వాసుదేవ మీనన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ ప్రియమణి, వెటరన్ యాక్టర్ ప్రకాష్ రాజ్, రెయిజింగ్ స్టార్ మమిత బైజు ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ శనివారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. దళపతి కెరీర్లో హిస్టారిక్ ప్రాజెక్ట్ గా తెరకెక్కింది. సిల్వర్‌స్క్రీన్ మీద ఆయన చివరిసారిగా కనిపించనున్న చిత్రం ఇదే అని చెప్పారు. దళపతి ఫ్యాన్స్ కి ఇదొక ఎమోషనల్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ‘బీస్ట్’ తర్వాత విజయ్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నారు. బాబీ దేవోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
హీరోగా విజయ్ సినిమా కెరీర్లో ఇది ఆఖరి చిత్రం అని అఫీషియల్ గా ప్రకటించారు. కేవీయన్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున అట్టహాసంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో కొబ్బరికాయ కొట్టేశారు. నవరాత్రుల్లో రెండో రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు కావడం విశేషం.ఈ కార్యక్రమంలో హీరో విజయ్ తో పాటు పూజా హెగ్డేతో ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
Authored By:
TA Kiran Kumar
Publish Later:
Yes
Publish At:
Friday, October 4, 2024 - 17:01
Mobile Title:
Vijay 69: పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైన విజయ్ ఆఖరి చిత్రం..
Created By:
Kiran Kumar
Updated By:
Kiran Kumar
Request Count:
23
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.