BSNL 24th Anniversary Offer: బీఎస్ఎన్ఎల్ టెలికాం ఛార్జీలు ఇతర దిగ్జజ కంపెనీల కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. అందుకే ఎక్కువ శాతం మంది పోర్ట్ అయ్యారు. అయితే, తాజాగా బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు 24జీబీ ఉచిత డేటాను అందించనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
BSNL 24th Anniversary Offer: పెరిగిన టెలికాం కంపెనీల ధరలు జూన్ నుంచి అమలు అయ్యాయి. జియో, ఎయిర్టెల్, వీఐ ఆపరేటర్లు రీఛార్జీ ప్లాన్ ధరలను పెంచేశాయి. ఇవి రెండూ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రెండిటికీ వర్తించింది. దాదాపు 15 శాతం రీఛార్జీధరలను పెంచాయి.
ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్కు చాలామంది పోర్ట్ అయ్యారు. ఈ ప్లాన్‌లో అదనంగా ఫ్రీ డేటా పొందుతారు. ఈ సరికొత్త ఆఫర్లో 24 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.బీఎస్ఎన్ఎల్ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ సరికొత్త ఆఫర్ ప్రకటించింది.ఈ ఆఫర్లో 4 జీ స్పీడ్‌తో 24జీబీ డేటా పొందుతారు.
ఈ ఆఫర్ పొందాలంటే.. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఈ ఆఫర్ పొందాలంటే రూ.500 కంటే ఎక్కువ రీఛార్జీ వోచర్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఆఫర్ కేవలం అక్టోబర్ 1 నుంచి 24 మధ్య వర్తిస్తుంది. బీఎస్ఎన్ఎల్ 24 ఏళ్ల నమ్మకం సేవలు సందర్భంగా రూ. 500 కంటే ఎక్కువ రీఛార్జీతో అదనంగా 24 జీబీ డేటా అదనంగా పొందుతారు. భారత్ సంచార్ నిగమ్ లిమిలెట్ (BSNL) 2000 అక్టోబర్ 1 న ప్రారంభించారు.
బీఎస్ఎన్ఎల్కు చాలామంది పోర్ట్ అయిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 4 జీ సేవలను ముమ్మరంగా ప్రారంభించడానికి విస్త్రత స్థాయిలో పనిచేస్తోంది. అంతేకాదు వచ్చే ఏడాది 5 జీ సేవలను కూడా అందించే దిశగా అడుగులు వేస్తోంది బీఎస్ఎన్ఎల్.