CM Revanth Reddy: రైతులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్‌.. ఇక 48 గంటల్లో ఖాతాల్లో డబ్బులు జమా..

CM Revanth Reddy Bumper Offer: రైతులకు పండుగ ముందే భారీ గుడ్‌ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్‌ రెడ్డి. సన్నవడ్ల కనీస మద్ధతు ధరతోపాటు రూ.500 బోనస్‌ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డబ్బులను కేవలం 48 గంటల్లో జమా చేయాలని ఆదేశించారు.
 

1 /5

ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లు పండిస్తున్న రైతులకు రూ.500 బోనస్‌ ఇవ్వనుంది. అది కూడా ఈ ఖరీఫ్‌ సీజన్‌లోనే. అంతేకాదు రైతుల ఖాతాల్లో ఈ డబ్బులను కేవలం 48 గంటల్లోనే జమా చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్‌.  

2 /5

ఈ మేరకు గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌ తెలిపారు. సన్నవడ్లకు రూ.500 బోనస్‌ ఇవ్వడంతోపాటు ఏ తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆ బాధ్యత కలెక్టర్ల్‌ ఉందన్నారు సీఎం. అంతేకాదు ఈ వడ్లను కొనుగోలు చేసినప్పుడు నిర్ధేశిత ప్రమాణాలు కూడా పాటించాలని సూచించారు.  

3 /5

రైతులు దోపిడీకి గురికాకుండా చూసుకోవాలి. వారు చేసిన ఏ ఫిర్యాదు అయినా కలెక్టర్‌లు బాధ్యత తీసుకోవాలన్నారు. అలాగే ప్రతి కేంద్రానికి ఒక నంబర్‌ ఇచ్చి సన్న వడల్ల సంచులపైన కూడా ఆ నంబర్‌ వేయాలి. దీంతో ఏ గోల్‌మాల్‌ జరగకుండా ఉంటుదన్నారు.  

4 /5

ఈ నేపథ్యంలో తేమ పేరుతో రైతులను మోసం చేయకూడదు అవసరమైతే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం సూచించారు. ఇతర సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా ధాన్యం మన రాష్ట్రంలోకి రాకుండా చెక్‌పోస్టులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలన్నారు. కొనుగోలు చేసిన వెంటనే రవాణా కూడా చేసేలా ఏర్పాట్లు చేయలన్నారు.  

5 /5

ప్రతిరోజూ కలెక్టర్లు తమ జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలి. కొనుగోళ్లకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి 24 గంటల పాటు పనిచేసే కాల్ సెంటర్‌ సదుపాయం కూడా కల్పించాలన్నారు సీఎం. ఈ ఏడాది 99 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో 44 లక్షలు దొడ్డురకం, 47 లక్షలు సన్నరకం అని చెప్పారు.