Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు. నైవేద్యం ఏం పెడతారు పూజావిధానం తెలుసుకుందాం.
నవ రాత్రులు గురువారం 3 వ తేదీ నుంచి ప్రారంభ కానున్నాయి. ఈ ప్రత్యేక రోజుల్లో నవదుర్గలను పూజిస్తారు. ముఖ్యంగా అమ్మ వార్లను 9 అవతారాల్లో పూజించి నైవేద్యం పెట్టి పూజిస్తారు. అయితే, మొదటి రోజు శైలపుత్రి బాల త్రిపుర సుందరీ దేవి అవతారంలో పూజిస్తారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ ఇంద్రకీలాద్రీ అమ్మ వార్ల అవతారాలను పరిగణలోకి తీసుకుంటారు.
ఈరోజుల్లో ఇంట్లోనే మాత్రమే కాదు.. మండపాలు కూడా ఏర్పాటు చేసుకుని అమ్మ వార్ల విగ్రహ ప్రతిష్ఠాపన చేసుకుంటున్నారు. దుర్గా మాతను పూజించడం వల్ల జీవితంలో శత్రు బాధలు తొలగిపోతాయి.
మొదటిరోజు 3వ తేదీ అమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరను సమర్పిస్తారు. ఎరుపు రంగు శక్తికి ప్రతిరూపం.
పీఠం ఏర్పాటు చేసుకుని అమ్మవారి విగ్రహం లేదా ఫోటో ఏర్పాటు చేసి అక్షితలు, పూలు, పసుపు, కుంకుమలతో అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవార్ల కృపకు పాత్రులవుతారు.
ఇక ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కట్టుపొంగలి, చవివిడి, వడపప్పు ప్రసాదంగా పెడతారు. ఇందులో ఉపయోగించే మిరియాలు భూత ప్రేత పిశాచాలను తరమడానికి ఉపయోగిస్తారని పండితులు చెబుతారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)