Simbu: తెలుగు బ్యూటీతో పెళ్లికి సిద్ధమైన శింబు.. స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

Simbu Marriage: ప్రముఖ కోలీవుడ్ హీరో శింబు తెలుగు బ్యూటీ నిధి అగర్వాల్తో ఏడడుగులు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఈశ్వరన్ సినిమాలో తొలిసారి నటించారు.  ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారని, ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

1 /6

కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శింబు ఒకప్పుడు అమ్మాయిల కలలు రాకుమారుడు అని చెప్పవచ్చు. ఇప్పట్లో అయితే అజిత్, విజయ్, సూర్య, కార్తీ వంటి హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ గతంలో శింబు పేరు ఎక్కువగా వినిపించేది. ముఖ్యంగా ఆయన నటించిన తమిళ చిత్రాలు చాలా వరకు తెలుగులో విడుదల అయ్యి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచేవి కూడా.   

2 /6

ముఖ్యంగా మన్మధ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రొమాంటిక్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు అక్టోబర్ 4వ తేదీన ఈ సినిమా రీ రిలీజ్ కూడా అవుతుండడంతో ఇప్పుడు శింబు కి సంబంధించిన పెళ్లి వార్తలు వైరల్ గా మారుతున్నాయి.  

3 /6

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు తెచ్చుకున్న శింబు ఎప్పటికప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.  కానీ ఇప్పటివరకు అందులో నిజం లేకపోయింది. మొన్నటికి మొన్న శ్రీలంకకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారని , తన తండ్రి అన్ని సెట్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. 

4 /6

అయితే ఇప్పుడు తాజాగా మరో తెలుగు హీరోయిన్ తో పెళ్లికి సిద్ధమయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు ప్రముఖ తెలుగు హీరోయిన్ నిధి అగర్వాల్. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

5 /6

ఇక శింబు వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. గతంలో హీరోయిన్ నయనతారతో ఎఫైర్ ఉందని వార్తలు వినిపించాయి. కానీ అప్పట్లో ఈ విషయం పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత హన్సిక ను ప్రేమించారు శింబు. ఆమెతో కూడా పెళ్లికి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపించాయి. కానీ హన్సిక పెళ్లి చేసుకోవడంతో ఈ వార్తలకు చెక్ పడింది. ఇలా  ఎప్పటికప్పుడు ఎఫైర్ రూమర్స్ వినిపించాయి.  కానీ ఏవి కూడా నిజం కాలేదు 

6 /6

41 సంవత్సరాల వయసులో కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే పేరు దక్కించుకున్న ఈయన.. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా  ఉండగా నిధి అగర్వాల్తో శింబు ఈశ్వరన్ అనే సినిమాలో నటించారు.  ఈ సినిమా సమయంలోనే వీరిద్దరు ప్రేమించుకున్నారని ,ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.