Lucky Zodiac Signs: ఈ 4 రాశులకు రేపట్నించి పట్టిందల్లా బంగారమే, ఆ లక్కీ రాశులివే

హిందూ జ్యోతిష్యం ప్రకారం అక్టోబర్ నెల చాలా ముఖ్యమైంది. సూర్య గ్రహణం, వివిధ గ్రహాల గోచారం ఉంటుంది. ఫలితంగా వివిధ రాశుల జీవితాలపై ప్రభావం చూపించనుంది. అక్టోబర్ 2 అంటే రేపు ఈ ఏడాదిలో చివరి సూర్య గ్రహణం సంభవించనుంది. దాంతో 4 రాశులకు అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. ఆ 4 లక్కీ రాశులేవో చూద్దాం..

Lucky Zodiac Signs: హిందూ జ్యోతిష్యం ప్రకారం అక్టోబర్ నెల చాలా ముఖ్యమైంది. సూర్య గ్రహణం, వివిధ గ్రహాల గోచారం ఉంటుంది. ఫలితంగా వివిధ రాశుల జీవితాలపై ప్రభావం చూపించనుంది. అక్టోబర్ 2 అంటే రేపు ఈ ఏడాదిలో చివరి సూర్య గ్రహణం సంభవించనుంది. దాంతో 4 రాశులకు అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. ఆ 4 లక్కీ రాశులేవో చూద్దాం..

1 /5

అక్టోబర్ నెలలో కీలకమైన గ్రహాల గోచారం ఉంది. శని గ్రహం శతభిష నక్షత్రంలో మారడం, గురు వక్రమార్గం, సూర్యుడు, బుధుడు, శుక్రుడు, మంగళ గ్రహాలు రాశి మారడం సంభవించనున్నాయి. అదే సమయంలో 4 రాజయోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఫలితంగా ఈ నాలుగు రాశులపై కనకవర్షం కురవనుంది. గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి. 

2 /5

కర్కాటక రాశి అక్టోబర్ నెల ఈ రాశివారికి చాలా శుభప్రదం. ఎప్పట్నించో పెండింగులో ఉన్నవి లేదా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. జీవితంలో ఎటు చూసినా సానుకూలంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశివారికి అదృష్టం మారిపోనుంది. అన్నింట్లో విజయం లబిస్తుంది. ఉద్యోగస్థులకు పదోన్నతి లభిస్తుంది. 

3 /5

వృషభ రాశి అక్టోబర్ నెలలో వృషభ రాశి జాతకులకు మహర్దశ పట్టనుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు, వ్యాపారులకు లాభాలు కలగనున్నాయి. ఉద్యోగస్థులకు పదోన్నతి వేతన పెంపు ఉంటాయి. కొత్త ఇళ్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశముంది. ఆకశ్మిక ధనలాభం ఉంటుంది. పట్టిందల్లా బంగారం కానుంది. 

4 /5

తులా రాశి ఈ రాశివారికి అక్టోబర్ నెల ఊహించని ప్రయోజనాలు అందిస్తుంది. వివిధ గ్రహాల గోచారం ప్రభావం తులా రాశి జాతకులపై స్పష్టంగా ఉంటుంది. ఇంట్లో సుఖ శాంతులు లభిస్తాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. వేతన పెంపు ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెర్చుకుంటాయి. ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుందంటారు. 

5 /5

సింహ రాశి సింహ రాశి జాతకులకు అక్టోబర్ నెల మహర్జాతకం కల్గించనుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఉద్యోగం మారాలనుకునేవారికి సైతం అనుకూలమైన సమయం. అనుకున్న లక్ష్యాలు పూర్తి చేయగలరు. ఊహించని విధంగా సంపద లభిస్తుంది. ఆర్ఠికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రాశివారిపై కనకవర్షం కురుస్తుంది.