Sridevi: మెగాస్టార్ చిరంజీవి, రోజా ముచ్చట్లు.. శ్రీదేవికి ఇష్టమైన ఫుడ్ చెప్పేసిన జంట.. ఎలా చేయాలంటే?

Chiranjeevi -Roja: గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా, చిరంజీవి శ్రీదేవికి ఇష్టమైన ఫుడ్ గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చిరంజీవి భార్య సురేఖ తయారు చేసే.. ఎండు చేపల కోడి గుడ్డు పులుసు.. అంటే శ్రీదేవికి చాలా ఇష్టమట.దానిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

1 /5

దివంగత నటీమణి , అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి గురించి పరిచాల ప్రత్యేకంగా అక్కర్లేదు. దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు,  స్వర్గీయ నందమూరి తారక రామారావును మొదలుకొని మెగాస్టార్ చిరంజీవి వరకు ఎంతో మంది హీరోలతో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా శ్రీదేవి అంటే ఒక తరం హీరోలకే కాదు అభిమానులకి కూడా ప్రత్యేకమైన అభిమానం అని చెప్పవచ్చు. సినిమా హీరోలే కాదు వ్యాపారవేత్తలు కూడా కనీసం ఒక్కరోజైనా శ్రీదేవితో టైం స్పెండ్ చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. 

2 /5

ఇకపోతే దుబాయ్ షేక్ కూడా శ్రీదేవితో ఒకరోజు మాట్లాడడం కోసం ఏకంగా విల్లా రాసిచ్చినట్లు అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి .ఇందులో ఎలాంటి నిజం ఉందో తెలియదు. అయితే ఇదిలా ఉండగా శ్రీదేవికి ఫేవరెట్ ఫుడ్ ఏంటి..? అనే విషయం వైరల్ గా మారుతుండగా ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి చెప్పడం గమనార్హం.

3 /5

ముఖ్యంగా చిరంజీవి భార్య సురేఖ తయారు చేసే ఎండుచేపల కోడిగుడ్డు పులుసు అంటే శ్రీదేవికి చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పుకొచ్చారు. గతంలో చిరంజీవి , రోజా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఈ విషయంపై వారు స్పందించినట్లు తెలుస్తోంది. శ్రీదేవి గారు అనగానే నాకు గుర్తొచ్చేది ఎండు చేపల కోడిగుడ్ల పులుసు  అంటూ చిరంజీవితో చెబుతుంది. 

4 /5

మరి ఆ ఫేవరెట్ డిష్ ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం.. ఎండు చేపలు కోడిగుడ్డు పులుసు తయారీకి కావలసిన పదార్థాలు :నూనె - 3 టేబుల్ స్పూన్లు , ఆవాలు - చిటికెడు, జీలకర్ర - చిటికెడు, ఎండు చేపలు - ఒక కప్పు, కరివేపాకు - 2 రెబ్బలు, మెంతాలు - హాఫ్ టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు - తరిగినవి ఒక కప్పు, కారం - ఒక టేబుల్ స్పూన్ , పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి సరిపడా, ఉడకబెట్టి పక్కన పెట్టిన గుడ్లు -2, చింతపండు పులుసు - ఒక కప్పు 

5 /5

స్టవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టి.. నూనె వేసి పోపు గింజలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు , పసుపు, ఉప్పు, కారం వేసి వేయించాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టుకున్న చింతపండు రసం,  అందులోనే ఉడకబెట్టిన గుడ్లు,  ఎండు చేపలు వేసి బాగా కలియబెట్టి ఒక గ్లాస్ నీరు వేయాలి. మరుగుతున్నప్పుడు మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా లో ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. అంతే సురేఖ తయారు చేసే శ్రీదేవికి ఇష్టమైన ఎండు చేపల కోడిగుడ్ల పులుసు రెడీ. ఇక ఈ విషయాన్ని చిరంజీవి తో  రోజా చెబుతూ..  మాట్లాడుతూ అందర్నీ నోరూరించేసారని చెప్పవచ్చు.