Devara Twitter Review: దేవర ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్‌కు మాస్ జాతర.. హైలా హైలా ఎన్టీఆర్ రికార్డులకు 'ఆయుధ పూజ'

Jr NTR Devara Movie Review and Public Talk: Jr NTR  కెరీర్‌పరంగా.. కొన్ని పరిస్థితుల కారణంగా తప్పక హిట్‌ పొందాల్సిన జూనియర్‌ ఎన్టీఆర్‌ 'దేవర'తో హిట్‌ కొట్టాడా లేదా అనేది ఓవర్సీస్‌ వర్గాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 27, 2024, 06:58 AM IST
Devara Twitter Review: దేవర ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్‌కు మాస్ జాతర.. హైలా హైలా ఎన్టీఆర్ రికార్డులకు 'ఆయుధ పూజ'

  Jr NTR Devara Movie Review and Public Talk: త్రిబుల్‌ ఆర్‌తో పాన్‌ వరల్డ్‌ విజయాన్నందుకున్న నందమూరి తారక రామారావు అలియాస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ 'దేవర'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్‌కు జోడిగా వచ్చిన మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ భారీ విజయాన్ని అందుకోబోతున్నాడా? అనేది సినీ పరిశ్రమతోపాటు రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసా. ట్విటర్‌లో సినిమాపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఓవర్సీస్‌లో చూసిన వారంతా సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తున్నారు. మరి వారి స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం. ఎస్‌ఎస్‌ రాజమౌళి సినిమా తర్వాత హీరోలకు తప్పక ఫ్లాప్‌ వస్తుందనే సంప్రదాయాన్ని ఎన్టీఆర్‌ చెరిపేశారా? అనేది చదివేసేయండి.

Also Read: Sobhita Chaitanya: నాకు నాగచైతన్యతో పిల్లలు కనాలని ఉంది: శోభిత ధూళిపాల

అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కు జోడీగా ఎన్టీఆర్‌ పవర్‌ ఫుల్‌ పాత్రలో నటించారు. కల్యాణ్‌ రామ్‌, మిక్కిలినేని సుధాకర్‌ నిర్మాణంలో రూ.300 కోట్లతో ఈ సినిమా తెరకెక్కింది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించాడు. సైల్‌ అలీఖాన్‌ ప్రతినాయక పాత్రలో.. ప్రకాశ్ రాజ్‌, శ్రీకాంత్‌, అజయ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా విదేశాల్లో ఇప్పటికే ప్రదర్శితమవుతోంది. ఎన్నారైల్లో ఊహించని స్పందన లభిస్తోందని సమాచారం. ఓవర్సీస్‌లో సినిమా చూసిన సినీ విమర్శకుడు ఉమైర్‌ సంధు కూడా దీనిపై ఓ రివ్యూ ఇచ్చారు.

Also Read: KTR Comments on Devara: దేవర ఈవెంట్ రద్దుపై కేటీఆర్ సంచలన కామెంట్స్..

నట విశ్వరూపం
గతంలో ఎన్నడూ లేనివిధంగా 'దేవర'లో ఎన్టీఆర్‌ తనలోని నటుడిని బయటకు తీసుకొచ్చారని టాక్‌. అతడి నట విశ్వరూపం అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోందని సమాచారం. అదేస్థాయిలో విలన్‌ పాత్రధారి సైఫ్‌ అలీఖాన్‌ తగ్గేదేలా అన్నట్టు నటించాడని నెటిజన్లు చెబుతున్నారు. పోరాట సన్నివేశాల్లో ఇద్దరూ మల్లయోధుల్లా పోరాడారని.. ఇద్దరూ తగ్గలేదని ట్విటర్‌రాయుళ్లు పోస్టులు చేస్తున్నారు. వారిద్దరి నటనతో సినిమా రేంజ్‌ను పెంచేసిందని చర్చ నడుస్తోంది. ఇక తొలిసారి తెలుగులో ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్‌ అందాలు స్క్రీన్‌ను మరింత అందంగా చేసిందని సినీ ప్రియులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆమె పాత్ర మాత్రం ఏదో హీరోయిన్‌ ఉండాలన్నట్టు పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

బీజీఎం బీభత్సం
ట్రైలర్‌, టీజర్‌లో సముద్రాన్ని ప్రధానంగా చూపించడంతో సినిమాలో కూడా సముద్రం కీలక పాత్ర పోషించిందని ట్విటర్‌ రివ్యూ ద్వారా అర్థమవుతోంది. తీరప్రాంతంలో పారే నెత్తురు అని పలు డైలాగ్‌లు ఉన్నాయి. అవి ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయని టాక్‌. కొరటాల శివ తన స్క్రీన్‌ప్లేతో సినిమాకు ప్రధాన బలమని చెబుతున్నారు. ఇక తిమింగలంతో యంగ్‌ టైగర్‌ సినిమాకే హైలెట్‌ అని తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లో తోపు అయిన అనిరుధ్‌ ఈ సినిమాకు ఇచ్చిన బీజీఎంతో థియేటర్‌లలో ప్రేక్షకులతో కేకలు, అరుపులు పెట్టించాయని సినిమా చూసినవాళ్లు సామాజిక మాధ్యమాల ద్వారా చెబుతూ ఖుషీ అవుతున్నారు. 

రాజమౌళి సంప్రదాయానికి చెక్‌?
ఏది ఏమైనా 'దేవర'తో ఎన్టీఆర్‌ కెరీర్‌లో భారీ హిట్‌ అని సినీ విశ్లేషకులు చెబుతున్న మాట. త్రిబుల్‌ ఆర్‌లో చెర్రీతో పాన్‌ వరల్డ్‌ హిట్‌ అందుకోగా.. ఈసారి సోలోగానే పాన్‌ వరల్డ్‌ హిట్ అందుకున్నాడని.. రాజమౌళితో చేసిన తర్వాత ఫ్లాప్‌ అనే కల్చర్‌ను ఎన్టీఆర్‌ తిరగరాశాడని ఓవర్సీస్‌ వర్గాల సమాచారం. 

తెలుగు ప్రేక్షకులు స్పందన ఎలా?
కాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఆడుతుందా అనేది ఆసక్తికరం. కొంత రాజకీయంగా కూడా ఈ సినిమా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌కు హిట్‌ పడాలి. మరి తెలుగు ప్రేక్షకులు ఎలాంటి స్పందన కనబరుస్తారనేది కొన్ని గంటల్లో తెలియనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

  

Trending News