Dry Cough Remedies: శరీరంలో ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో అత్యంత నరకప్రాయమైంది డ్రై కాఫ్ అంటే పొడి దగ్గు. వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. మీక్కూడా పొడి దగ్గు అదే పనిగా వేధిస్తుంటే కొన్ని సులభమైన హోమ్ రెమిడీస్ సహాయంతో నివారించవచ్చు.
ఉప్పు నీరు ఉప్పు నీటితో రోరగర చేయడం వల్ల పొడి దగ్గు నుంచి త్వరంగా ఉపశమనం లభిస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతుంది.
నెయ్యి నల్ల మిరియాలు పొడి దగ్గు కారణంగా గొంతులోపల ఒరిసిపోతుంది. ఇది దగ్గును మరింతగా ట్రిగ్గర్ చేస్తుంది. నెయ్యితో పాటు నల్ల మిరియాలు కలిపి సేవిస్తే చాలా ప్రయోజనకరం. సగం చెంచా నెయ్యిలో చిటికెడు మిరియాల పౌడర్ కలిపి సేవించాలి. రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.
ఉప్పు అల్లం మిశ్రమం అల్లంలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఎక్కువ. పొడి దగ్గును సహజసిద్ధంగా నిర్మూలించేందుకు అల్లం ఉపయోగపడుతుంది. అల్లం చిన్న చిన్న ముక్కలుగా కోసి కొద్దిగా ఉప్పు చల్లి లేదా తేనె కలిపి సేవించాలి. నోట్లో 5-7 నిమిషాలుంచాలి.
పసుపు మిరియాలు పసుపులో ఉండే కర్క్యూమిన్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. నల్ల మిరియాలతో కలిపి సేవిస్తే పొడి దగ్గుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఆరెంజ్ జ్యూస్ లేదా గోరు వెచ్చని నీటిలో ఒక చెంచా పసుపు, పావు చెంచా మిరియాల పౌడర్ కలిపి సేవిస్తే మంచి ఫలితాలుంటాయి.
గోరు వెచ్చని నీటిలో తేనె తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ. గొంతు మంటను తగ్గిస్తుంది. గొంతు పొరల్ని కోట్ చేసేందుకు దోహదం చేస్తుంది. పొడి దగ్గుతో బాధపడుతుంటే రోజుకు 3-4 సార్లు ఒక స్పూన్ తేనెను గోరు వెచ్చని నీటిలో కలిపి సేవించాలి