Sharad Purnima 2024: శరద్ పూర్ణిమ ఎప్పుడు..? ఆరోజు ఇలాంటి పనులు అసలు చేయకండి..?

Sharad Purnima Significance: ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన హిందూ శాస్త్రం ప్రకారం ఎంతో పవిత్రంగా భావించే శరద్ పూర్ణిమ రాబోతోంది.  ఈ రోజున దయచేసి కొన్ని పనులు చేయకండి అంటూ పండితులు హెచ్చరిస్తున్నారు.  ఈ అశ్విని మాసంలో వచ్చే ఈ పూర్ణిమకు ఎంతో పవిత్రత ఉంది అని , సంపద, ఆరోగ్యానికి ప్రతీక అని చెబుతున్నారు 

1 /6

ప్రతి ఏడాది శరద్ పూర్ణిమ.. అశ్విని మాసం శుక్లపక్ష చతుర్దశి తిధి మరుసటి రోజున వస్తుంది. ఈ రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి అలాగే విష్ణువును పూజించే సాంప్రదాయం ఉంది.  ముఖ్యంగా మత విశ్వాసాల ప్రకారం ఈ శరద్ పూర్ణిమ రోజున భక్తిశ్రద్ధలతో లక్ష్మి నారాయణులను పూజించడం వల్ల జీవితంలో సుఖశాంతులు,  బాధలు తొలగిపోతాయని పెద్దవారి విశ్వాసం. మరి ఈ సంవత్సరం ఈ శరద్ పూర్ణిమ రోజు  ఉపవాసం ఆచరించాలి.. 

2 /6

మన హిందూ క్యాలెండర్ ప్రకారం అశ్విని మాసం పౌర్ణమి తేదీ అక్టోబర్ 16 వ తేదీన రాత్రి 8:40 గంటలకు ప్రారంభం అవుతుంది. అదే సమయంలో మరుసటి రోజు అనగా అక్టోబర్ 17వ తేదీ 4:55 గంటలకు ముగుస్తుంది. ఈ కారణంగా శరద్ పూర్ణిమ పండుగ అక్టోబర్ 16వ తేదీన జరుపుకుంటారు. ఇక చంద్రోదయ సమయం సాయంత్రం 5:05 గంటలకు ప్రారంభం అవుతుంది. 

3 /6

ఇక శరద్ పూర్ణిమ రాత్రి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది.  కాబట్టి రాత్రి సమయంలో పూర్తిగా చంద్రుడు ప్రకాశిస్తాడు అంటే 16 దశలలో చంద్రుడు నిండి ఉంటాడు. ముఖ్యంగా ఈ రోజున చంద్రుడి కిరణాల కారణంగా భూమిపై అమృత వర్షం కురుస్తుందని అందరూ నమ్ముతున్నారు.   

4 /6

ఈ చంద్రకాంతి సమయంలో.. ఆ చంద్రుడి కాంతి లో ఖీర్ తయారు చేసి ఉంచడం వల్ల ఆ ఖీర్ లో అమృతం చేరుతుందని,  ఈ అమృతంతో కూడిన ఖీర్ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడి , జీవిత సమస్యలు దూరం అవుతాయని పెద్దలు చెబుతారు. 

5 /6

ఇకపోతే ఈ శరద్ పూర్ణిమ రోజు తెలిసి తెలియక దయచేసి ఇలాంటి తప్పులు చేయకండి అంటూ పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం , మాంసం సేవించకూడదు. అలాగే ఆహారంలో ఉల్లి , వెల్లుల్లి ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి కోపానికి గురి అయ్యి ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందట.   

6 /6

అలాగే ఇంట్లో గొడవలు పడకుండా ఇంటిల్లిపాది లక్ష్మీదేవికి పూజ చేయాలట. అలాగే శరద్ పూర్ణిమ నాడు నలుపు రంగు దుస్తులు ధరించకూడదట. తెలుపు రంగు దుస్తులు మాత్రమే ధరించడం ప్రధమంగా భావిస్తారు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x