NPS Vatsalya Vs Mutual Funds: ఎన్‌పీఎస్ వాత్సల్య, మ్యూచువల్ ఫండ్స్.. ఈ రెండింటిలో పిల్లల పేరిట డబ్బు దాచడానికి.. ఏది బెస్ట్

NPS Vatsalya Vs Mutual Funds: అయితే మ్యూచువల్ ఫండ్స్‎లో కూడా మీ పిల్లల పేరిట డబ్బులు దాచిపెడితే చక్కటి రిటర్న్స్ వస్తాయని మరికొందరు నిపుణులు చెప్తున్నారు.  ఇప్పుడు ఈ రెండు పథకాల్లో ఏది బెస్ట్ తెలుసుకుందాం.  

Written by - Bhoomi | Last Updated : Sep 22, 2024, 03:40 PM IST
NPS Vatsalya Vs Mutual Funds: ఎన్‌పీఎస్ వాత్సల్య, మ్యూచువల్ ఫండ్స్.. ఈ రెండింటిలో పిల్లల పేరిట డబ్బు దాచడానికి.. ఏది బెస్ట్

NPS Vatsalya Vs Mutual Funds:  తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా వారి భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడానికి తమ కెరీర్ ప్రారంభం నుంచే పొదుపు లేదా మదుపు చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో  అందుబాటులో ఉన్న పలు రకాల  స్కీం లలో పిల్లల పేరిట డబ్బు దాచడానికి ఏ స్కీం మంచిదా అని ఆలోచిస్తున్నారా. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన NPS  వాత్సల్య స్కీం గురించి తెలుసుకుందాం. అలాగే ఈ స్కీం  ప్రస్తుతం అందుబాటులోనే మ్యూచువల్ ఫండ్స్ తో పోల్చి చూస్తే  లాభదాయకమా కాదా అనే విషయం కూడా తెలుసుకుందాం.

 నిజానికి పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఇటీవల ఎన్‌పిఎస్ వాత్సల్య పథకం ప్రారంభించారు. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్ చాలా కాలంగా ఇలాంటి పథకంగా దీర్ఘకాలంలో చక్కటి లాభాలను అందిస్తున్నాయి. ఈ రెండు పెట్టుబడి మాధ్యమాలలో దేనిలో పెట్టుబడి పెడితే మంచిదా అని ఆలోచిస్తున్నారా..అయితే ఈ పెట్టుబడి ఎంపిక అనేది పిల్లల ఆర్థిక లక్ష్యాలు, రిస్క్, పన్ను ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది. 

Also Read : SSY: సుకన్య సమృద్ధి యోజన ద్వారా అమ్మాయి పేరిట 50 లక్షలు పొందాలంటే ఏం చేయాలి?

NPS వాత్సల్య గురించి:

NPS వాత్సల్య అనేది పిల్లల భవిష్యత్తును సురక్షితం చేయాలనుకునే తల్లిదండ్రుల కోసం రూపొందించిన పెన్షన్ స్కీం. ఈ పథకం ద్వారా  తల్లిదండ్రులు పిల్లల పేరిట డబ్బును పెన్షన్ ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు, దీర్ఘకాలిక ప్రాతిపదికన సంపదను సృష్టించడానికి  ఈ స్కీం చాలా ఉపయోగపడుతుంది. ఇందులో కనీస కాంట్రిబ్యూషన్  సంవత్సరానికి రూ.1,000 మాత్రమే. మరోవైపు, పిల్లల మ్యూచువల్ ఫండ్‌లు దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం ఉద్దేశించారు. ఈ ప్లాన్‌ కోసం కనీసం ఐదు సంవత్సరాలు లేదా పిల్లవాడు యుక్తవయస్సు వచ్చే వరకు, ఏది ముందుగా ఉంటే అది లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటుంది. కనీస పెట్టుబడి మొత్తం నెలకు రూ.100 మాత్రమే అని గుర్తించాలి.  

ఏది ఎంచుకోవడం మంచిది? 

ఆర్థిక నిపుణుల సలహా ప్రకారం NPS, ఈక్విటీలు, కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడం అనేది దేనికదే భిన్నమైనది. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో పెట్టుబడిదారుడు తన రిస్క్ ఆధారంగా ఫండ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్ అధిక రిస్క్‌ను కలిగి ఉంటాయి. కానీ అధిక రాబడి అందించే అవకాశం ఉంటుంది. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా అధిక రాబడిని ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. NPS మ్యూచువల్ ఫండ్స్ రెండూ దీర్ఘకాలికంగా డబ్బు పెద్ద మొత్తంలో సృష్టించడానికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. వీటిలో ఒకదానిని ఎంచుకోవడం అనేది మీ ఆర్థిక లక్ష్యాలను బట్టి ఎంపిక చేసుకోవాలి.

Also Read : Sahara Refund: సహారా డిపాజిటర్లకు గుడ్ న్యూస్.. ఇకపై మరింత ఎక్కువ రిఫండ్ పొందవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News