Bajaj Chetak Blue 3202 Price: 126 కిలోమీటర్ల మైలేజీతో కొత్త చేతక్ బ్లూ 3202 వేరియంట్‌ లాంచ్‌.. పూర్తి వివరాలు ఇవే!

Bajaj Chetak Blue 3202 On Road Price: ప్రముఖ ఎలక్ట్రిక్ క్ స్కూటర్ తయారీ కంపెనీ బజాజ్ తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. గతంలో విడుదల చేసిన చేతక్ మోడల్‌కు మరో అప్డేట్ వేరియంట్ ఆడ్ అయింది. దానికి సంబంధించిన ఫీచర్స్ ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 22, 2024, 03:07 PM IST
Bajaj Chetak Blue 3202 Price: 126 కిలోమీటర్ల మైలేజీతో కొత్త చేతక్ బ్లూ 3202 వేరియంట్‌ లాంచ్‌.. పూర్తి వివరాలు ఇవే!

 

Bajaj Chetak Blue 3202 On Road Price: ప్రముఖ స్కూటర్ తయారీ కంపెనీ బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పరిధిని వేగంగా మార్కెట్లో విస్తరిస్తూ వెళ్తోంది. దీంతో కంపెనీ కొత్త కొత్త ఫీచర్స్‌తో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. గతంలో విడుదల చేసిన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి మార్కెట్లో విశేష స్పందన లభించడంతో కంపెనీ మరో ముందడుగు వేసింది. దీనిని బజాజ్ కొత్త బ్లూ 3202 వేరియంట్‌లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది గతంలో విడుదల చేసిన స్కూటర్స్ కంటే భిన్నమైన లుక్‌లో కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ కలర్‌కి ఉన్న మంచి గుర్తింపు కారణంగా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ బజాజ్ స్కూటర్ త్వరలోనే  ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, టీవీఎస్ ఐక్యూబ్‌తో పాటు మరికొన్ని ఈ స్కూటర్స్‌తో పోటీ పోటీ పడబోతోంది. 

అంతేకాకుండా త్వరలోనే బజాజ్ కంపెనీ ఈ స్కూటర్స్ కు సంబంధించిన చార్జింగ్ స్టేషన్స్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా సులభంగా దగ్గరలోని స్టేషనులకు వెళ్లి బ్యాటరీ మార్చుకోవడమే కాకుండా చార్జింగ్ చేసుకునే సదుపాయం కూడా కలుగుతుంది. అలాగే దూర ప్రయాణాలు చేసినప్పుడు ఈ చార్జింగ్ స్టేషన్ లో ఉండడం వల్ల సులభంగా బ్యాటరీలు మార్చుకొని మరింత దూరం ప్రయాణం చేసే అవకాశాన్ని కూడా కంపెనీ తొందర్లోనే కల్పించబోతోంది. అంతేకాకుండా కంపెనీ భవిష్యత్తులో ఈ స్కూటర్స్‌కి ప్రత్యేకమైన స్పీడ్ బ్యాటరీ చార్జింగ్ సెటప్‌ని కూడా అందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కొత్త చేతక్ బ్లూ 3202, చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ వివరాలు: 
చేతక్ బ్లూ 3202 ఈ స్కూటర్ అద్భుతమైన లుక్కులో కనిపించేందుకు మంచి ఫినిషింగ్ టచ్ ను అందించింది. అలాగే ఇక ఈ స్కూటర్ ధర వివరాల్లోకి వెళ్తే.. దీని ధర ఎక్స్-షోరూమ్ ధర రూ.1.15 లక్షలుగా ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా గత మోడల్ తో పోలిస్తే బ్యాటరీ పరంగా ఈ వేరియంట్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ దీని మైలేజీ పరిధి మాత్రం 126 కిలోమీటర్ల నుంచి 135 కిలోమీటర్ల వరకు పెరిగిందని కంపెనీ వెల్లడించింది. గతంలో పాత వేరియంట్ ధర రూ.1.37 కాగా ఇప్పుడు కొనుగోలు చేసే వారికి దాదాపు రూ.8,000 వరకు తగ్గింపు లభిస్తుంది. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఇక ఈ స్కూటర్కు సంబంధించిన ఛార్జింగ్ వివరాల్లోకి వెళితే..ఇది 650W ఛార్జర్‌ సెటప్ లో వస్తోంది. ఈ బ్యాటరీ ని పూర్తిగా చార్జ్ చేయడానికి దాదాపు 5 గంటలకు పైగానే పడుతున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతోపాటు ఈ స్కూటర్ కీలెస్ ఇగ్నిషన్, కలర్ LCD డిస్ప్ల తో వస్తోంది. అలాగే ఇందులో రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఈ స్కూటర్ నిమిషానికి  73 kmph గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. అలాగే అద్భుతమైన స్పోర్ట్స్ మోడ్, బ్లూటూత్ కనెక్టివిటీ, హిల్ హోల్డ్ టీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్ ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News