/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844
Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్, ఆఫీస్‌లకు సెలవు
180844
రాజకీయ ప్రయాణం: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రాజకీయ ప్రయాణం ఆప్ నుంచి ప్రారంభమైంది. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పార్టీ మ్యానిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. ఆ తర్వాత ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగారు. ఆతిశీపై పెద్దగా అవినీతి ఆరోపణలు ఏవీ లేవు.
ఆప్ నాయకురాలు అతిషి జూన్ 8, 1981న విజయ్ సింగ్, త్రిప్తా వాహీల కుటుంబంలో జన్మించారు. ఆతిశీ న్యూఢిల్లీలోని స్ప్రింగ్‌డేల్ స్కూల్లో చదువుకున్నారు. సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, DU నుండి చరిత్రలో పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పీజీ చేశారు.
అతిషి ఎవరు?
అతిశీ పేరును సీఎంగా ప్రకటించిన తర్వాత అతిశీ ఎవరనే చర్చ సాగుతోంది. ఆమె రాజకీయ జీవితం ఎప్పుడు మొదలైంది? ఎక్కడ చదువుకున్నారు? కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో కూడా కొత్త సీఎంగా అతిషి పేరు మీడియాలో ప్రస్తావనకు వచ్చింది. అయితే ఆ సమయంలో అలాంటి ఊహాగానాలు ఏవైనా ఆప్ తోసిపుచ్చింది.
విద్యామంత్రిత్వ శాఖతోపాటు పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా అతిశీ చేపట్టారు . ఈసారి ఢిల్లీ బడ్జెట్‌ను కూడా ఆమెనే ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్ ప్రసంగంలో మహిళల కోసం పలు ప్రత్యేక ప్రకటనలు చేశారు.తన ఎలాంటి ఒత్తిడి లేదని ఆ సమయంలో తన దగ్గర రూ. 30వేలు ఉన్నట్లు తెలిపారు.
ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆతిశీ మొత్తం ఆస్తుల విలువ రూ. 1.41కోట్లు. ఇది కాకుండా ఆమె భర్త ఆస్తుల విలువ రూ. 81.42 లక్షలు. తనకు ఇల్లు, కారు లేదని ఎన్నికల ఆఫిడవిట్లో పేర్కొన్నారు.
ఆతిశీ ఢిల్లీ సీఎం పీఠాన్ని ఎక్కడం ఖాయమైంది. ఇక ఆమె ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. ఢిల్లీ స్టూడెంట్లకు మెరుగైన విద్యను అందించాలన్న ఆప్ టార్గెట్ కు అనుగుణంగా 43ఏండ్ల అతిశీ విధులు నిర్వర్తించారు. కల్కాజీ సౌత్ నుంచి 2020 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలో ఆమె ఎన్నికల ఆఫిడవిట్లో తన నికర విలువకు సంబంధించి సమాచారాన్ని అందించారు.
Who is Atishi: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ మహిళా నేత ఆతిశీ మర్లెనా సింగ్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆప్ ఎమ్మెల్యేల కీలక సమావేశంలో ఆతిశీని శాసనసభాపక్షనేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కొత్త సీఎం ఆతిశీని ప్రతిపాదించారు. కేజ్రీవాల్ ప్రతిపాదనకు ఆప్ ఎమ్మెల్యేలు సైతం మద్దతు తెలిపారు. ఈ పరిణామంలో ఢిల్లీ నూతన సీఎంగా ఆతిశీ పేరు ఖరారు అయ్యింది. ఆప్ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్, పీడబ్ల్యూడీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఆతిశీ. ఇక దివంగత నేత సుష్మాస్వరాజ్, షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఆతిశీ ఆస్తుల పాస్తుల గురించి తెలుసుకుందాం.
Authored By:
Bhoomi
Publish Later:
No
Publish At:
Tuesday, September 17, 2024 - 16:32
Mobile Title:
ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి..ఆమె ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Created By:
Madhavi Vennela
Updated By:
Madhavi Vennela
Published By:
Madhavi Vennela
Request Count:
52
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.