Imd weather forecast: రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో దేశంలో పలు ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటన జారీ చేసింది.
రెండు తెలుగు స్టేట్స్ లలో కొన్నిరోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికి కూడా వర్షాల వల్ల తెలుగు స్టేట్స్ లోని అనేక ప్రాంతాలు ఇప్పటికి కూడా కొలుకోలేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కూడా అధికారులకు సూచనలు జారీచేశారు.
ఈ క్రమంలో వాతావరణ కేంద్రం మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. రానున్న 24 గంటల్లో బంగాళ ఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని బాంబు పేల్చింది. ఇది వాయుగుండంగా మారి విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
అల్పపీడన ప్రభావం వల్ల.. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, బిహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని తెలుస్తోంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని సమాచారం.
అటు ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటివారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని వల్ల ప్రజలు ముందుగా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచించింది.
ముఖ్యంగా వర్షాలు అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లోని ఆయా సర్కారుముందు జాగ్రత్తలు తీసుకొవాలని వాతావరణ కేంద్రం అలర్ట్ ను జారీ చేసింది. అవసరమైతే తప్ప బైటకు రావొద్దని కూడా సూచనలను జారీ చేసింది.
తెలంగాణలో వర్షాల ఎఫెక్ట్ మాత్రం కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో మరోసారి వర్షాలు కురుస్తుందని వాతావరణ కేంద్రం అలర్ట్ తో ఏపీ ప్రభుత్వం సైతం అధికారులను, ప్రజల్ని సైతం అప్రమత్తం చేసినట్లు సమాచారం.