Harish Rao Arrest: సైబరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద నిరసనకు దిగిన మాజీ మంత్రి హరీశ్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై FIR నమోదు చేయాలంటూ సీపీ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ నేతలు బైఠాయించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరినా వెనక్కి తగ్గలేదు. దీంతో ఇప్పటివరకు వేచి చూసిన పోలీసులు నేతలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పోలీసుల అక్రమ అరెస్టులను సహించం అంటూ హరీశ్ రావు ఫైర్ అయ్యారు. హరీశ్ రావును బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో కుక్కేశారు పోలీసులు. దీంతో హరీశ్ రావు చేయి తీవ్ర గాయం అయినట్లు తెలుస్తోంది. వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలా కర్ , సబితా ఇంద్రారెడ్డితోపాటు పలువురు నేతలను అరెస్టు చేశారు పోలీసులు.
కాగా ఉదయం నుంచి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీల మధ్య తీవ్ర వివాదం చెలరేగుతుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిన వెంటనే ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వెంటనే కౌశిక్ రెడ్డికి చేరుకున్నారు. అనంతరం కౌశిక్ రెడ్డిని పరామర్శించారు. కేటీఆర్ ఇలాంటి విషయం మాట్లాడలేదు. హరీశ్ రావు మాత్రం దగ్గర ఉండి మరీ పోరాటం చేయడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
గాంధీని అరెస్టు చేయాలని లేదంటే కోర్టుకు వెళ్తామంటూ డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా హరీశ్ రావు, కాంగ్రెస్ సర్కార్ పనితీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు హరీశ్ రావు. కేటీఆర్ మాత్రం ట్వీట్స్ చేస్తున్నారు కానీ..బహిరంగంగా అధికార పక్షాన్ని విమర్శించడంలో వెనకడుగు వేస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read: Home Loan: హోంలోన్ EMI భారంగా మారిందా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి.. ఈజీగా తీరిపోతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.