MG Windsor EV launch: ఫ్లైట్ ఫీచర్లతో మతి పోగొడుతున్న MG Windsor EV ధర ఇతర ఫీచర్లు ఇలా

MG Windsor EV launch: ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ నడుస్తోంది. వివిధ కంపెనీలు ఒకదాన్ని మించిన మరొక ఫీచర్లతో ఈవీ కార్లు ప్రవేశపెడుతున్నాయి. ఇప్పుడు ఎంజీ కంపెనీ సరికొత్త ఈవీ కారును భారతీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇందులో ఫీచర్లు, ఇంటీరియర్ చూస్తే బిజినెస్ క్లాస్ విమానయానం గుర్తొస్తుంది

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 12, 2024, 12:25 PM IST
MG Windsor EV launch: ఫ్లైట్ ఫీచర్లతో మతి పోగొడుతున్న MG Windsor EV ధర ఇతర ఫీచర్లు ఇలా

MG Windsor EV launch: MG Windsor EV దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో ప్రవేశించడంతోనే హల్‌చల్ సృష్టించింది. అద్భుతమైన ప్రదర్శనతో పాటు లగ్జరీ ఇంటీరియర్ ఈ కారు సొంతం. విమానంలో బిజినెస్ తరగతిలో ఎలాంటి ఇంటీరియర్ ఫీచర్లు ఉంటాయో అలా ఉంటాయంటున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

MG Windsor EV లాంచ్ అవుతూనే సంచలనం రేపింది. అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో మార్కెట్‌ను కుదిపేసిందని చెప్పవచ్చు. కారులో కూర్చున్నవారికి విమానంలో బిజినెస్ క్లాస్‌లో కూర్చున్నట్టు ఉంటుంది. అంతటి ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన సిట్టింగ్ ఉంటుంది. సీట్లలో హై క్వాలిటీ లెదర్ అప్ హోల్‌స్ట్రీ, ఎలక్ట్రానిక్ అడ్జస్ట్‌మెంట్, మసాజింగ్ ఫంక్షన్ ఉంటాయి. ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్ పెద్దదిగా ఉంటుంది. కేబిన్ మొత్తం ఓపెన్ ఎయిర్ ఫీలింగ్ ఇస్తుంది. విమానంలో బిజినెస్ తరగతిలో ఉన్నట్టే ఇందులో వెనుక సీట్లను ఫ్లాట్ బెడ్ కింద మార్చుకోవచ్చు. దాంతో దూర ప్రయాణాలు కూడా హాయిగా ఉంటాయి. ఎలాంటి అలసట ఉండదు. 

ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. వాయిస్ కమాండ్, నేవిగేషన్, ఇతర కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. ఇందులో 8.8 ఇంచెస్ టీఎఫ్టీ డిజిటల్ మల్టీ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే ఉంటుంది. 15.6 ఇంచెస్ ఇంటెలిజెంట్ కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది. ఈ కారులో 360 డిగ్రీల కెమేరా ఏడీఏఎస్ టెక్నాలజీతో ఉంటుంది. ఇందులో అటానమస్ ఫీచర్లు కూడా ఉన్నాయి. డ్రైవింగ్ చాలా సురక్షితంగా ఉండేలా తీర్చిదిద్దారు. 

పవర్‌ఫుల్ బ్యాటరీ, రేంజ్, డిజైన్

ఇందులో 38 కిలోవాట్స్ సామర్ధ్యం కలిగిన లిథియం ఫెరో ఫాస్పేట్ భ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సింగిల్ రీఛార్జ్‌తో 331 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. శాశ్వతమైన మేగ్నెట్ ఎలక్ట్రిక్ మోటార్ కలిగిన ఈ కారులో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్, ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్, ఫ్లష్ డోర్ హ్యాండిల్, ఆటో రన్ సెన్సింగ్ వైపర్స్, రేర్ డిఫాగర్ ఫీచర్లు ఉంటాయి. ఈ కారు ఎలక్ట్రిక్ మోటార్ 136 పీఎస్ పవర్, 200 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగల సామర్ధ్యం కలిగి ఉంటుంది. MG Windsor EV ఎక్స్ టీరియర్ లుక్స్ చాలా ఆధునికంగా ఉన్నాయి. ఇందులో ఏరోడైనమిక్ బాడీ, ఎల్ఈడీ హెడ్ లైట్స్, ఎల్లాయ్ వీల్స్‌తో ప్రీమియం లుక్ ఉంటుంది. 

ఇందులో సెమీ ఆటానమస్ డ్రైవింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఫలితంగా డ్రైవింగ్ చాలా సురక్షితంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ద్వారా కారును మోనిటర్ చేయడం, నియంత్రించడం చేయవచ్చు. ఇక సేఫ్టీ విషయంలో కూడా MG Windsor EV దేనీకీ తీసిపోదు. 6 ఎయిర్ బ్యాగ్స్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్, ఎలక్ట్రిక్ పార్కింగ్, ఆటో హోల్డ్, టైర్ ప్రెషర్ మోనిటరింగ్ సిస్టమ్, ఈబీజీ విత్ ఏబీఎస్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్ ఉంటాయి. 

MG Windsor EV 9.99 లక్షల ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఇందులో 3 వేరియంట్లు, 4 రంగులు అందుబాటులో ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి ధర మారుతుంది. 9.99 లక్షలు అనేది ఎక్స్ షోరూం ప్రైస్ మాత్రమే

Also read: MBBS Merit List: ఏపీలో ఎంబీబీఎస్ కోర్సుల ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News