Milk Tea Side Effects: టీ..దేశంలో అత్యధికంగా అత్యంత ఇష్టంగా తాగే పానీయం. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎప్పుడు రిలాక్సేషన్ కావాలన్నా మిల్క్ టీ తాగుతుంటారు. అయితే పరిమితి మించి తాగితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని మీకు తెలుసా.. అవును నిజమే. మిల్క్ టీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాాయి. మిల్క్ టీ తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయో తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యం మిల్క్ టీ తాగడం వల్ల అందులో అధికంగా ఉండే పంచదార గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే కెఫీన్, పంచదార కారణంగా రక్తపోటు పెరుగుతుంది. దాంతో గుండె వ్యాధులు తలెత్తుతాయి
ఐరన్ లోపం టీలో ట్యానిన్ అనే రసాయనం కారణంగా ఐరన్ సంగ్రహణ లోపిస్తుంది. ప్రత్యేకించి భోజనం తిన్న వెంటనే మిల్క్ టీ తాగడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఫలితంగా ఎనీమియా సమస్య రావచ్చు. దాంతో బలహీనత, తల తిరగడం, అలసట సమస్యలు రావచ్చు
కిడ్నీలపై ప్రభావం మిల్క్ టీ తాగడం వల్ల టీలో ఉండే ఆక్సలేట్ కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు. మందు నుంచి కిడ్నీ సమస్య ఉండేవాళ్లు మిల్క్ టీ తాగకూడదు. లేకపోతే మరింత నష్టం కలుగుతుంది. కిడ్నీ ఫిల్టరింగ్ ఫంక్షన్ బలహీనమౌతుంది
నిద్రలేమి టీలో కెఫీన్ పెద్దమొత్తంలో ఉంటుంది. శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. టీ అతిగా తాగడం వల్ల నిద్రలేమి సమస్య ఉంటుంది. నిద్రలేమి సమస్య ఉన్నవాళ్లు టీ తాగితే ఆ సమస్య మరింతగా పెరుగుతుంది.
జీర్ణ సంబంధ సమస్యలు మిల్క్ టీ అతిగా తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. టీలో ఉండే కెఫీన్, ట్యానిన్, కడుపులో ఎసిడిటీకి కారణమౌతాయి. ఫలితంగా యాసిడ్ రిఫ్లెక్స్, అజీర్తి సమస్య ఉత్పన్నమౌతుంది.