CM Revanth reddy: తెలంగాణ సర్కారు మరోసారి ఐపీఎస్ అధికారులను బదిలీచేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కమిషనర్ గా.. డైనమిక్ అధికారి సీవీ ఆనంద్ కు మరోసారి అవకాశం ఇచ్చింది.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఇప్పటికే అనేక మంది ఐపీఎస్ లు, ఐఏఎస్ లకు స్థానచలనం కల్పించారు.ఈ క్రమంలో.. రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం హాయాంలో అక్రమాలకు పాల్పడిన వారికి తనదైన స్టైల్ లో షాక్ ఇస్తు వస్తున్నారు.
ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా బీఆర్ఎస్ కు సపోర్ట్ గా ఉన్న అధికారులకు.. రేవంత్ ఇప్పటికే స్థాన చలనం కల్పించారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణలో మరోసారి పలువురు ఐపీఎస్ లను బదిలీచేస్తు సర్కారు ఉత్వర్వులు జారీ చేసింది.
తెలంగాణలో.. ఐదుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్‌ను రేవంత్ సర్కార్ నియమించింది. అదే విధంగా.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్, పోలీస్ పర్సనల్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా ఎం. రమేష్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలుగు స్టేట్స్ కు సీవీ ఆనంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 1991 బ్యాచ్ ఐపీఎస్‌కు చెందిన సీవీ ఆనంద్.. ఇప్పటికే ఒకసారి హైదరాబాద్ సిటీ కమిషనర్‌గా పనిచేశారు . 2021 డిసెంబర్ 25 నుంచి 2022 అక్టోబర్ 11 వరకూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు.
ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం.. 2023 లో.. ఏసీబీ డైరెక్టర్‌గా సీవీ ఆనంద్ ను నియమించింది. ఆ తర్వాత హైదరాబాద్‌కు సందీప్ శాండిల్య, కొత్తకోట శ్రీనివాస్‌లు సీపీలుగా పనిచేశారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్లీ ఆనంద్‌కే సీపీ బాధ్యతలు ఉంటాయని చాలా రోజులుగా వార్త హల్ చల్ చేస్తుంది.
ఈ నేపథ్యంలో మరోసారి సీవీ ఆనంద్ కే రేవంత్ సర్కారు.. మొగ్గు చూపడం పట్ల హైదరాబాద్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు స్టేట్స్ విభజన తర్వాత.. సీవీ ఆనంద్ కు తెలంగాణ కేడర్ కు కేటాయించారు. మెయిన్ గా.. మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తనదైన మార్కుగా చూపించారు. ఎక్కడిక్కడ మావోయిస్టుల కార్యకలాపాలను కంట్రోల్ చేశారు.
సీవీ ఆనంద్ సేవలకు గాను.. 2002లో రాష్ట్రపతి గ్యాలంట్రీ మెడల్ కూడా దక్కించుకున్నారు. హైదరాబాద్ సిటీ ఈస్ట్, సెంట్రల్ జోన్ల డీసీపీగా మూడేళ్లు, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌గా రెండేళ్లు, ట్రాఫిక్ కమిషనర్ హైదరాబాద్ సిటీలో మూడున్నరేళ్లు, కమిషనర్‌గా కొన్నేళ ఏళ్ల మెట్రోపాలిటన్ అర్బన్ పోలీసింగ్‌లోసైతం పనిచేశారు.
తెలంగాణలో 2001లో బషీర్‌బాగ్‌లో కాల్పుల ఘటన జరిగినప్పుడు ఈయనే ముఖ్య అధికారిగా ఉన్నారు. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాల కోసం సరికొత్తగా నంబరింగ్, కోడింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. 2002 మేలో ‘లేక్ పోలీస్’ వ్యవస్థను సైతం సీవీ ఆనందే ఏర్పాటు చేశారు..