ఐసిసి ప్రపంచ కప్ విజేత ఎవరో తేలిపోయే సమయం దగ్గరపడింది. న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌పైనే ఇప్పుడు ప్రపంచ క్రికెట్ ప్రియుల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ప్రపంచ కప్‌కి ఆతిథ్యమిస్తోన్న ఇంగ్లండ్ జట్టు 27 ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారిగా ఫైనల్‌కు చేరుకుంది. అనుకూలించే వాతావరణం, అలవాటుపడిన పిచ్ వంటి అంశాల పరంగా సొంత గడ్డపై జరుగుతున్న పోరాటం కావడం ఆ జట్టుకు ఓ ప్లస్ పాయింట్‌గా మారింది.
Also read : ఆ 45 నిమిషాలే టీమిండియా కొంపముంచాయి : విరాట్ కోహ్లీ
టాస్ వేయడం 15 నిమిషాలు ఆలస్యం కావడంతో మ్యాచ్ సైతం 15 నిమిషాలు ఆలస్యంగా 3:15 గంటలకు ప్రారంభమైంది.