Pro Kabaddi League 2024 Full Schedule: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ షెడ్యూల్ రిలీజ్ అయింది. అక్టోబర్ 18వ తేదీ నుంచి పీకేఎల్ ప్రారంభంకానుంది. ఈసారి మూడు నగరాల మూడు నగరాల కారవాన్ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. గత సీజన్ 12 వేర్వేరు నగరాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం కేవలం మూడు నగరాల్లోనే ఈ మెగా టోర్నీ జరగనుంది. ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ మ్యాచ్‌లు హైదరాబాద్, నోయిడా, పుణె వేదికగా జరగనున్నాయి. అక్టోబర్ 18వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభంకానున్నాయి. ఆ తరువాత నవంబర్ 10 నుంచి నోయిడాలో రెండో అంచె లీగ్ జరగనుంది. డిసెంబర్ 3 నుంచి పూణెలోని బలివాడి బ్యాడ్మింటన్ స్టేడియం వేదికగా మూడో అంచె నిర్వహించనున్నారు. అయితే ప్లేఆఫ్ తేదీలు, వేదికను నిర్వాహకులు ఇంకా ప్రకటించలేదు.
Also Read: YS Jagan: వరద కష్టాలకు చలించిన మాజీ సీఎం వైఎస్ జగన్.. పార్టీ తరఫున భారీ విరాళం
సీజన్ 11 షెడ్యూల్ సందర్భంగా ప్రో కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ.. పీకేఎల్ 10 సీజన్లు విజయవంతంగా జరిగాయని.. సీజన్ 11 సరికొత్తగా ప్రారంభంకానుందన్నారు. ఈ లీగ్ మరో మైలురాయికి చేరుకుందని.. దేశం, ప్రపంచవ్యాప్తంగా కబడ్డీ ఆటను అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుందన్నారు.
మొత్తం 12 జట్లు పీకేఎల్‌లో ఆడనున్నాయి. హర్యానా స్టీలర్స్ , పుణెరి పల్టాన్, జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా, తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్, పాట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్, యూపీ యోధాస్, దబాంగ్ ఢిల్లీ కెసి, బెంగాల్ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు పాల్గొనున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 విజేతగా పూణేరి పల్టన్ నిలిచింది. ఫైనల్ పోరులో హర్యానా స్టీలర్స్‌ను 28-25తో ఓడించింది. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఉంటుంది. డిస్నీ + హాట్‌స్టార్ యాప్‌లో కూడా చూడొచ్చు.
పీకేఎల్ సీజన్ 11 కు సంబంధించిన వేలం ఆగస్టు 15, 16వ తేదీల్లో ముంబైలో నిర్వహించారు. ఇందులో 8 మంది ఆటగాళ్లు కోటి రూపాయలకు పైగా అమ్ముడుపోవడం విశేషం. పీకేఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. రూ.2.15 కోట్లకు సచిన్ తన్వర్‌ను తమిళ తలైవాస్ కొనుగోలు చేసింది. పీఎకేఎల్ చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకున్న ఆటగాడిగా నిలిచాడు.
Also Read: Chandrababu 3rd Day: పాములు, తేళ్లతో జీవిస్తున్న వరద బాధితులపై సీఎం చంద్రబాబు భావోద్వేగం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.