Natural Star Nani Movie: తెలుగులో హిట్.. హిందీలో ఫట్.. నాని మూవీతో బొక్కబోర్లా..!

Telugu Hit Movies Disaster in Hindi: హిందీ సినిమాలు తెలుగులో.. టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ చేయడం సాధారణమే. అయితే అక్కడ హిట్ కొట్టిన సినిమాలు ఇక్కడ ఒక్కొసారి హిట్ అవుతుంటాయి. ఒక్కొసారి దారుణంగా ఫ్లాప్ అవుతుంంటాయి. ఇక్కడ హిట్ సినిమాలను హిందీ ప్రేక్షకులు కొన్నింటిని ఆదరిస్తే.. మరికొన్నింటిని తిరస్కరించారు. కొన్ని చిత్రాలు అయితే.. ఒరిజినల్ మూవీతో పోలిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా కూడా నిలిచాయి. అయితే కొన్ని చిత్రాలు ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించిన బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి. వీటిలో నాని మూవీ కూడా ఒకటి ఉంది.
 

1 /5

నాని జెర్సీ మూవీ తెలుగు సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.  

2 /5

2019లో రిలీజ్ అయిన ఈ సినిమా రూ.30 కోట్ల వసూళ్లు రాబట్టింది. నాని యాక్టింగ్, సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది.  

3 /5

ఈ మూవీని షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా హిందీలో జెర్సీ పేరుతోనే తెరకెక్కించారు. తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి రూపొందించారు.  

4 /5

అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. కనీసం పెట్టిన ఖర్చును కూడా రాబట్టలేకపోయింది.  

5 /5

2020 విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీని అనేకసార్లు వాయిదా వేస్తూ.. చివరకు 2022లో రిలీజ్ చేశారు. రూ.95 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించగా.. రూ.30 కోట్లు మాత్రమే రాబట్టింది.