ITBP Constable Recruitment 2024: పారామిలిటడరీ ఫోర్స్‌లో జాయిన్ అవ్వాలనేది మీ కల అయితే, ఐటీబీపీ (ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్) భారీ శుభవార్త చెప్పింది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ద్వారా భారీ నోటిఫికేషన్ విడుదల అయింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఐటీబీపీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ద్వారా కేవలం పదో తరగతి అర్హతతో దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఐటీబీపీ కానిస్టేబుల్ (కిచెన్ సర్వీస్) 819 పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. అధికారిక వెబ్‌సైట్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
recruitment.itbpolice.nic.in రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు నుంచి యాక్టివ్‌గా ఉంది. ఈ నోటిఫికేషన్‌కు చివరి తేదీ అక్టోబర్ 1. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఐటీబీపీ కానిస్టేబుల్ (కిచెన్ సర్వీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 697 ఖాళీలు పురుష అభ్యర్థులు, 122 మహిళా అభ్యర్థుల ఖాళీల భర్తీకి స్వీకరణ చేపట్టింది. ఈ ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
మొదట ITBP recruitment.itbpolice.nic.in ఓపెన్ చేయాలి. ఆ తర్వాత హోంపేజీలో 'ITBP కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024' సెలక్ట్ చేయాలి. ఆ తర్వాత మీ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలి. అప్పుడు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
మీ వివరాలు నమోదు చేసి అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఇప్పుడు పూర్తి వివరాలతో ఫారమ్ లో అప్లికేషన్ లో నమోదు చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి చివరగా ఫారమ్ సబ్మిట్ చేయాలి. కన్ఫర్మెషన్ పేజీ డౌన్‌లోడ్ చేసి భవిష్యత్తు అవసరాల నిమిత్తం ఈ ప్రింట్ అవుట్ తీసిపెట్టుకోవాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పాసై ఉండాలి. అంతేకాదు అభ్యర్థులు NSQF లెవల్ 1 కోర్సు ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదా ఇనిస్టిట్యూట్ చేసి ఉండాలి. వయస్సు 18- 25 మధ్య ఉండాలి.
ఎంపిక విధానం.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియేన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్ (PST), రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ (DME) లేదా రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ (RME) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.