2024 Bhadrapada Amavasya Effect On Zodiac Signs: భాద్రపద అమావాస్య ఒక ముఖ్యమైన హిందూ పర్వదినం. ఈ రోజు పూజలు చేయడం, దానాలు ఇవ్వడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. అయితే ఈ అమావాస్య రోజున కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు కలుగున్నాయని జ్యోతిషశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
2024 Bhadrapada Amavasya Effect On Zodiac Signs: భాద్రపద అమావాస్య హిందూ క్యాలెండర్‌లోని ప్రత్యేకమైన పర్వదినాలలో ఒకటి. భాద్రపద అమావాస్య 2 రోజులు ఉంటుంది. ఈనెల సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 5.21 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 7.24 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో కొన్ని రాశులవారిక శుభ యోగం కలుగుతుందని జ్యోతిషశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
భాద్రపద అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పూర్వీకులను స్మరించుకుని, వారికి తర్పణం, పిండప్రదానం చేయడం ఆచారం.
శివుడుకు అంకితం అయిన ఈ రోజున శివలింగాన్ని అభిషేకిస్తారు. అలాగే ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం వస్తుందని నమ్మకం.
మరి కొంతమంది భక్తులు ఈ రోజున ఉపవాసం ఉంటారు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని భావిస్తారు.
జ్యోతిషశాస్త్ర నిపుణుల ప్రకారం ఈ రోజున కొన్ని రాశులవారికి అద్భుతమైన యోగం ఉందని చెబుతున్నారు.
వృషభ రాశి: వృషభ రాశి వారికి ఈ అమావాస్య ఆర్థిక జీవితంలో ఎంతో శుభదాయకం. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటుంది. ప్రమోషన్, బదిలీ లేదా కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
మిథున రాశి: భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య మిథున రాశి వారికి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. ఆరోగ్యం పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి.
కన్యా రాశి: కన్యారాశి వారికి భాద్రపద అమావాస్య ఎంతో శుభప్రదంగా ఉంటుంది. బ్యాంక్ ఖాతాలో డబ్బు పెరుగుతుంది. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. ఇష్టదైవారాధన పాటించండి.
తులా రాశి: తులారాశి వారికి ఈ అమావాస్య చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో అదృష్టం వరించే అవకాశం ఉంది. పెట్టుబడులు పెడితే అవి మంచి లాభాలను ఇస్తాయని చెప్పబడింది.
కుంభ రాశి: జీవితంలో సంతోషం నిండి ఉంటుంది. మనశ్శాంతి లభిస్తుంది. వృత్తిరంగంలో మంచి ఫలితాలు లభిస్తాయి. కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం.
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE TELUGU NEWS అదే విషయాన్ని ధృవీకరించలేదు.