Food Supply with Drones: ఓ వైపు భారీ వర్షాలు మరోవైపు కృష్ణా నది వరదలతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. వీధులు, వంకలు అన్నీ జలమయమయ్యాయి. సింగ్ నగర్, ఊర్మిలా నగర్, రాజరాజేశ్వరి నగర్, పైపుల రోడ్ ఇలా నీట మునిగిపోయాయి. వరదల్లో చిక్కుకున్నవారి ఆకలి తీర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
విజయవాడ వరదల్లో చిక్కుకున్నవారికి తాగునీరు, పాలు, ఆహారం సరఫరా చేయడం కష్టంగా మారింది. అపార్ట్మెంట్ల చుట్టూ వరద నీరు చేరుకుంది. బయటకు రాలేని పరిస్థితి. రోడ్లపై కొన్ని చోట్లు నడుము లోతు, మరి కొన్ని చోట్ల మనిషి లోతు వరద నీరు చేరుకుంది. బుడమేరు వాగు, కృష్ణా నది వరద ప్రవాహానికి విజయవాడ వణికిపోయింది. తాగునీటికి, పాలకు కటకటలాడుతున్నారు. వరదల్లో చిక్కుకున్నవారికి ఆహారం, పాలు, వాటర్ ప్యాకెట్లు సరఫరా చేయడం గగనమైపోయింది. దాంతో రోప్ వే ద్వారా సరఫరా చేసేందుకు ప్రయత్నించారు.
లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్నవారికి ద్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు సరఫరా చేసేందుకు సిద్ధమౌతున్నారు. ద్రోన్ల ద్వారా ఫుడ్ బాస్కెట్లు తీసుకెళ్లే విదానాన్ని పరిశీలించారు. ద్రోన్ల ద్వారా 8-10 కిలోల వరకూ ఫుడ్, మెడిసిన్, వాటర్ తీసుకెళ్లవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడిక ఫుడ్ డెలివరీ ద్రోన్లను సిద్ధం చేస్తున్నారు.
Also read: Rain Alert: ఏపీకు బిగ్ అలర్ట్, సెప్టెంబర్ 5 వరకు భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.