Telangana highcourt: తెలంగాణ హైకోర్టులో ఈరోజు ( సోమవారం) స్మితా సబర్వాల్ వికలాంగులపై చేసిన వ్యాఖ్యల పట్ల పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో దీనిపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
సీనియర్ ఐఏఎస్, డైనమిక్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గతంలో సివిల్ సర్వీసెస్ వంటి సర్వీసులలో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా.. అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీంతో ఇది తీవ్ర వివాదాస్పదంగా మారింది. అనేక మంది మేధావులు, సీనియర్ రాజకీయ నేతలు సైతం స్మితా వ్యాఖ్యల్ని తప్పుపట్టారు.
మరోవైపు దివ్యాంగ హక్కుల సంఘం కూడా పోలీసులకు ఫిర్యాదు సైతం చేసింది. మరోవైపు ఈ ఘటన చిలికి చిలికి గాలివానగా మారింది. ఏకంగా స్మితాపై చర్యలు తీసుకొవాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై తాజాగా, హైకోర్టు ధర్మాసనం విచారించింది.
తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్, సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని హైకోర్టు నిశితంగా పరిశీలించింది. ఆమెపై చర్యలు తీసుకొవాలంటూ కూడా పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం స్మితాకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది.
స్మితా సబర్వాల్ మీద దాఖలైన పిటిషన్లను పరిశీలించిన ధర్మాసనం.. వాటికి విచారణ అర్హత లేదంటూ..కూడా కొట్టేసింది. దీంతో.. స్మితా సబర్వాల్‌కు బిగ్ రిలీఫ్ లభించినట్టయింది. వివాదాస్పదంగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేద్కర్ వ్యవహారంపై స్పందిస్తూ.. దివ్యాంగుల రిజర్వేషన్ల గురించి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
దివ్యాంగులపై స్మితా పెట్టిన పోస్టు ఏకంగా దేశంలో రచ్చగా మారింది. ఒక దివ్యాంగుడికి సర్జన్ గా ఒప్పుకుంటారా... ఒక దివ్యాంగుడికి పైలేట్ గా అవకాశం ఇస్తారా.. అంటూ స్మితా పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారింది.
దీంతో కొంత మంది స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టగా, మరికొంద మాత్రం స్మితాకు సపోర్ట్ గా నిలిచారు. మహారాష్ట్ర క్యాడెర్ అధికారిణి.. పూజా ఖేడ్కర్ అనేకే ఫెక్ సర్టిఫికేట్ లు సబ్మిట్ చేసి సివిల్స్ లో ఉత్తీర్ణత సాధించింది. ఈ క్రమంలోనే, స్మితా సబర్వాల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా సమాచారం.