LIC Kanyadan Policy: ఎల్ఐసీ నుంచి ఆడపిల్ల భవిష్యత్తు కోసం సరికొత్త పాలసీ.. మెచ్యూరిటీ తర్వాత మీ చేతికి 28 లక్షలు

LIC Scheme for Daughter: ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎల్‌ఐసి కన్యాదాన్ పాలసీ చాలా మంచి ఎంపిక. ఈ పాలసీ ప్లాన్ కింద, మీరు మీ కూతురు కోసం భారీ నిధిని డిపాజిట్ చేయవచ్చు. ఈ టర్మ్ పాలసీ ప్లాన్ పన్ను ప్రయోజన రుణ సౌకర్యంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. ఇప్పుడు ఈ పాలసీ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం.  

Written by - Bhoomi | Last Updated : Aug 31, 2024, 06:04 PM IST
LIC Kanyadan Policy: ఎల్ఐసీ నుంచి ఆడపిల్ల భవిష్యత్తు కోసం సరికొత్త పాలసీ.. మెచ్యూరిటీ  తర్వాత మీ చేతికి 28 లక్షలు

Lic Kanyadaan Policy : ఆడపిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన ఉంటుంది. పిల్లల చదువు నుంచి పెళ్లి వరకు పొదుపు చేస్తుంటారు. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో పాలసీలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( LIC ) ఆడపిల్లల భవిష్యత్తు  కోసం కూడా ప్రత్యేక పాలసీ ప్లాన్‌ను ప్రారంభించింది. ఆడపిల్ల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎల్‌ఐసి కన్యాదాన్ పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది.  ఈ ప్లాన్‌లో మీరు మీ కుతురు కోసం రూ. 22.5 లక్షల నిధిని డిపాజిట్ చేయవచ్చు. అంతే కాకుండా పన్ను ప్రయోజనాలు,లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీ కూతురు  వయస్సు 1 సంవత్సరం నుండి 10 సంవత్సరాల మధ్య ఉంటే, మీరు ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

LIC కన్యాదాన్ పాలసీ గురించి:

-LIC  కన్యాదాన్ పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్. ఈ పాలసీ కాలపరిమితి 13-25 సంవత్సరాలు.

-ఇందులో మీరు  ప్రీమియం చెల్లింపు కోసం నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షికం..ఇందులో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. 

-మెచ్యూరిటీ సమయంలో, మీరు పొదుపు మొత్తం + బోనస్ + చివరి బోనస్‌తో సహా  మొత్తాన్ని పొందుతారు.

-ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి, తండ్రి వయస్సు 50 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.

Also Read : Savings Rules : 50-30-20 ఫార్ములాతో ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. జీవితంలో జేబు ఖాళీ అయ్యే పరిస్థితి రమ్మన్నా రాదు..ఎలాగంటే..?  

-LIC కన్యాదాన్ పాలసీ  ప్రయోజనాలు:

-LIC కన్యాదాన్ పాలసీని కొనుగోలు చేసిన మూడేండ్లలో  మాత్రమే పెట్టుబడిదారుడు లోన్ తీసుకోవచ్చు. 

-పాలసీ తీసుకున్న రెండేళ్ల తర్వాత, పెట్టుబడిదారుడు దానిని సరెండర్ చేసే చాన్స్ ఉంటుంది. 

-ఈ పాలసీలో, గ్రేస్ పీరియడ్‌లో ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. దీనిలో మీరు ఏ నెలలోనైనా ప్రీమియం చెల్లించనట్లయితే..ఎలాంటి ఫైన్  లేకుండా తదుపరి 30 రోజుల్లో ప్రీమియం చెల్లించవచ్చు.

-కన్యాదాన్ పాలసీలో ప్రీమియం చెల్లింపుపై 80C కింద మినహాయింపు కూడా ఉంటుంది. 

-సెక్షన్ 10డి కింద మెచ్యూరిటీ మొత్తంపై  పన్ను ప్రయోజనం ఉంటుంది. 

మెచ్యూరిటీ తర్వాత మీరు ఎంత ప్రయోజనం పొందుతారు:

ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీలో 25 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే, మీరు ఏటా రూ.41,367 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి నెలా ప్రీమియం దాదాపు రూ. 3,447 అవుతుంది. 25 ఏళ్ల మెచ్యూరిటీ కోసం, మీరు 22 ఏళ్లు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు మెచ్యూరిటీ తర్వాత మీరు దాదాపు రూ. 22.5 లక్షల లాభం పొందుతారు.

మరణ ప్రయోజనం:

పాలసీ సమయంలో తండ్రి చనిపోతే, బిడ్డ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితిలో ప్రీమియం మాఫీ అవుతుంది. ఆడపిల్లకు 25 సంవత్సరాల పాటు సంవత్సరానికి రూ. 1 లక్ష మెచ్యూరిటీ తర్వాత, ఆమెకు ఏకమొత్తం అందుతుంది. అదే సమయంలో రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణిస్తే మరణ ప్రయోజనాలతో పాటు రూ.10 లక్షల ప్రమాద మరణ ప్రయోజనం కూడా లభిస్తుంది. నామినీ ప్రమాదవశాత్తు మరణ ప్రయోజనం పొందుతాడు.

Also Read :Business Ideas : మహిళలు కేవలం రూ. 3000కే ఈ కోర్సు నేర్చుకుంటే చాలు.. నెలకు రూ.1 లక్ష సంపాదించుకునే అవకాశం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News