టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లికి ఐసిసి ఊహించని షాక్ ఇచ్చింది. సౌతాంప్టన్‌లో రోజ్ బౌల్ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎక్సెస్సివ్ అప్పీలింగ్ (లెక్కకు మించి అప్పీలింగ్) చేశాడంటూ విరాట్ కోహ్లికి 25% మ్యాచ్ పీజ్ కోత విధించింది. ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్‌లో బ్రీచింగ్ లెవల్ 1 పరిధిని దాటినందుకే కోహ్లీకి ఈ జరిమానా విధించినట్టు ఐసిసి స్పష్టంచేసింది. కోహ్లీ పసికూనలే కదా అని అనుకున్న ఆఫ్ఘనిస్తాన్.. భారత్‌ని తక్కువ స్కోర్‌కే పరిమితం చేయడంలో సక్సెస్ అవడమే కాకుండా లక్ష్య ఛేదనలోనూ భారత్‌కి చుక్కలు చూపించింది. దాదాపు ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్ గెలిచినట్టేనన్న రీతిలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించుకున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ హజ్రతుల్లా జజయికి మహ్మద్ షమి వేసిన ఓ బంతి అతడిని స్టంప్స్ ముందే ఔట్ అయినట్టుగా కనిపించిందంటూ టీమిండియా ఆటగాళ్లు అంపైర్‌కి అప్పీల్ చేశారు. అయితే, కోహ్లీ అప్పీలుకి అంపైర్ అలీమ్ దార్ నుంచి కాదనే సమాధానమే వచ్చింది. అంపైర్ సమాధానంతో సంతృప్తిచెందని కోహ్లీ.. బౌలర్ షమి, ధోనిలతో చర్చించి మరోసారి రివ్యూ కోరాడు. ఆన్ ఫీల్డ్ రివ్యూలోనూ కోహ్లికి అదే సమాధానం లభించింది. దీంతో ఒకింత అసహనానికి గురైన కోహ్లీ వెంటనే అంపైర్ల వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగడం అటు అంపైర్లను, ఇటు ఐసిసిని అసహనానికి గురిచేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. షమి వేసిన మరో ఓవర్ లో హజ్రతుల్లా తన వ్యక్తిగత స్కోర్ 10 పరుగుల వద్ద వుండగా షమి బౌలింగ్‌లోనే పెవిలియన్ బాటపట్టాడు.
ఆఖర్లో షమి, జస్ప్రిత్ బుమ్రా తమ బౌలింగ్‌తో ఆఫ్గాన్ ఆటగాళ్లను కట్టడి చేయడంతో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్‌ల అనంతరం టీమిండియాకు 9 పాయింట్స్‌తో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తర్వాత మూడో స్థానంలో కొనసాగుతోంది.