Juice Precautions: బ్రేక్‌ఫాస్ట్ అనేది అత్యంత కీలకమైంది. ఈ సమయంలో తినే ఆహారాన్ని బట్టి ఆ రోజంతా ఎలా ఉంటామనేది ఉంటుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్ అనేది హెల్తీగా ఉండాలి. చాలామందికి బ్రేక్‌ఫాస్ట్‌లో జ్యూస్ తీసుకోవడం ఇష్టం. కానీ రకాల ఫ్రూట్ జ్యూస్‌లు బ్రేక్‌ఫాస్ట్ సమయంలో తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కల్గిస్తుంది. అవేంటో తెలుసుకుందాం
దానిమ్మ జ్యూస్ దానిమ్మ జ్యూస్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. బ్రేక్‌ఫాస్ట్‌లో మాత్రం మంచిది కాదు. ఇందులో కూడా నేచురల్ షుగర్ ఎక్కువ. అందుకే ఉదయం వేళ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది.
బనానా జ్యూస్ బనానా జ్యూస్ కూడా బ్రేక్‌ఫాస్ట్‌లో సేవించకూడదు. ఇందులో పొటాషియం, నేచురల్ షుగర్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఉదయం అల్పాహారంతో తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. కేలరీలు పెరుగుతాయి. త్వరగా ఆకలేస్తుంది
మేంగో జ్యూస్ మేంగో జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. కానీ బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఇది మంచిది కాదు. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. నేచురల్ షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదయం వేళ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.
సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ సిట్రస్ ఫ్రూట్ జ్యూస్‌లు ముఖ్యంగా ఆరెంజ్, బత్తాయి, నిమ్మ వంటివి బ్రేక్‌ఫాస్ట్ సమయంలో తీసుకోకూడదు. ఇందులో యాసిడ్ అధిక పరిమాణంలో ఉంటుంది. దాంతో ఎసిడిటీ సమస్య ఉత్పన్నం కావచ్చు. ప్రత్యేకించి యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యతో బాధపడేవారికి చాలా ప్రమాదం
ప్యాకెట్ ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్ ఫ్రూట్ జ్యూస్‌లో షుగర్ క్వాంటిటీతో పాటు ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్యాకెట్ జ్యూస్ తీసుకోవడడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోవచ్చు. ఇన్సులిన్ బ్యాలెన్స్ తప్పుతుంది. అలసట, నీరసం ఆవహిస్తాయి. పోషకాల లోపం కూడా తలెత్తుతుంది