Supreme Court of India Recruitment 2024: దేశ అత్యున్నత్త న్యాయస్థానం సుప్రీంకోర్టు 80 జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టుల భర్తీకి ఇటీవల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్ లింక్‌ను విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు నేటి నుండి సెప్టెంబర్ 12 వరకు ఆసక్తితోపాటు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ షురూ అయ్యింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.sci.gov.in/ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.
జీతభత్యం:
జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులకు లెవెల్ 3 పే మెట్రిక్స్ ప్రకారం బేసిక్ పే రూ.21700. HRAతో సహా మొత్తం జీతం నెలకు రూ.46,210.
ఎలా దరఖాస్తు చేయాలి?
- ముందుగా https://cdn3.digialm.com/EForms/configuredHtml/32912/90642/Index.html వెబ్ సైట్లోకి వెళ్లాలి.
- రిజిస్టర్ చేయడానికి అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
-ఇప్పుడు వెబ్ పేజీలోకి వెళ్లి అక్కడ అడిగిన ప్రాథమిక వివరాలను ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- రిజిస్టర్ నెంబర్, పాస్ వర్డ్ మీరు ఎంటర్ చేసిన ఇమెయిల్ వస్తుంది.
- దాని ఆధారంగా వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.
- లాగిన్ పై క్లిక్ చేయండి.
-రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి.
- అవసరమైన అర్హత వివరాలు, పత్రాల వివరాలు, వ్యక్తిగత వివరాలను అందించి దరఖాస్తు చేయండి.
Also Read :EPFO Interest: ఈపీఎఫ్ ద్వారా రూ. 4 కోట్ల ఫండ్ పొందాలంటే.. ప్రతి నెల ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి..?
- దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
- తదుపరి సూచన కోసం పూర్తి చేసిన అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి.
అర్హతలు :
సుప్రీంకోర్టు జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/బోర్డ్ నుండి SSLC ఉత్తీర్ణతతోపాటు వంట/కలినరీ సబ్జెక్ట్‌లో కనీసం ఒక సంవత్సరం ఫుల్ టైమ్ డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రసిద్ధ హోటళ్లు / రెస్టారెంట్లు / ప్రభుత్వ విభాగాలలో కనీసం 3ఏండ్ల పాటు వంట చేసిన అనుభవం ఉండాలి.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు మించకూడదు. ఇతర వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు 3 సంవత్సరాలు, షెడ్యూల్డ్ కులాలు/ షెడ్యూల్డ్ తెగ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం:
-రూ.400. ఇతర వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు రూ.400.
-షెడ్యూల్డ్ కులం/షెడ్యూల్డ్ తెగ/మాజీ సైనికులు/మహిళా అభ్యర్థులకు రూ.200.
-దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.200 మార్కులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.