Mr Bachchan 1st Week Box Collections: ‘ధమాకా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు రవితేజ. కానీ అది అందని ద్రాక్షగానే మిగిలిచింది. తాజాగా హరీష్ శంకర్ కూడా రవితేజకు హిట్ ఇవ్వలేకపోయాడు. ‘మిస్టర్ బచ్చన్’ గా రవితేజను ఆ పాత్రలో చూడమని చెప్పేసారు ప్రేక్షకులు. హిందీలో హిట్టైన ‘రెయిడ్’ మూవీని పూర్తిగా మార్చి సరికొత్త స్క్రిప్ట్ తో తెరకెక్కించినా.. ప్రేక్షకులు ఆ చిత్రాన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు. నిన్నటితో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. హిందీలో హిట్టైన ‘దబాంగ్’ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు పలు మార్పులు చేర్పులతో ‘గబ్బర్ సింగ్’గా తెరకెక్కించి పవన్ కళ్యాణ్ కు మెమరబుల్ హిట్ అందించాడు. కానీ రవితేజ విషయంలో మాత్రం హరీష్ శంకర్ అంచనాలు పూర్తిగా తప్పాయి.
హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అజయ్ దేవ్ గణ్ హీరోగా తెరకెక్కిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా ‘మిస్టర్ బచ్చన్’ మూవీని తెరకెక్కించాడు హరీష్ శంకర్. ఈ చిత్రం 1980లో ప్రముఖ ఇన్ కంటాక్స్ ఆఫీసర్ సర్ధార్ ఇందర్ సింగ్ జీవితం నేపథ్యంలో రాజ్ కుమార్ గుప్తా తెరకెక్కించారు. అయితే నార్త్ ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ చిత్రాన్ని సౌత్ ప్రేక్షకులు పెద్దగా రుచించలేదనే చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..
తెలంగాణ (నైజాం).. రూ. 3.03 కోట్లు..
సీడెడ్ (రాయలసీమ) -- రూ. 1.13 కోట్లు
మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ .. రూ. 2.74 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 6.90 కోట్లు షేర్ (రూ. 11.05 కోట్ల గ్రాస్)
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ .. రూ. 45 లక్షలు
ఓవర్సీస్.. రూ. 57 లక్షలు..
మొత్తంగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారంలో రూ. 7.92 కోట్ల షేర్ (రూ. 13.20 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ రాబట్టింది.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 7.92 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు రూ. 24.08 కోట్ల షేర్ రాబట్టాలి. ఇపుడుతున్న పరిస్థితుల్లో ఈ సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం ఇంపాజిబుల్ అని చెప్పాలి. మొత్తంగా హిట్ కోసం ఎదురు చూస్తోన్న రవితేజకు ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. మొత్తంగా హరీష్ శంకర్ చేసిన ఈ ప్రయోగాన్ని ప్రేక్షకులు ఆమోదించలేదు. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో క్యూట్ లుక్స్ తో అట్రాక్ట్ చేసింది.
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి